Best Sleeping Tip: మంచి గాఢమైన నిద్ర కావాలా.. ఇలా చేస్తే చాలు..

ప్రస్తుత కాలంలో చాలా మంది ఇబ్బంది పడే సమస్యల్లో నిద్ర లేమి సమస్య కూడా ఒకటి. ఎంత నిద్ర పోదామని ట్రై చేసినా చాలా మందికి నిద్ర రాదు. రోజంతా ఎంత కష్ట పడి వచ్చినా.. రాత్రి పూట సరైన నిద్ర లేకపోతే చాలా నీరసంగా ఉంటుంది. అంతే కాకుండా ఏ పని మీద కూడా ధ్యాస పెట్టలేం. శరీరానికి తగినంత నిద్ర లేకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. ముఖ్యంగా బీపీ, షుగర్, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం..

Best Sleeping Tip: మంచి గాఢమైన నిద్ర కావాలా.. ఇలా చేస్తే చాలు..
Deep Sleep
Follow us

|

Updated on: Jul 30, 2024 | 4:43 PM

ప్రస్తుత కాలంలో చాలా మంది ఇబ్బంది పడే సమస్యల్లో నిద్ర లేమి సమస్య కూడా ఒకటి. ఎంత నిద్ర పోదామని ట్రై చేసినా చాలా మందికి నిద్ర రాదు. రోజంతా ఎంత కష్ట పడి వచ్చినా.. రాత్రి పూట సరైన నిద్ర లేకపోతే చాలా నీరసంగా ఉంటుంది. అంతే కాకుండా ఏ పని మీద కూడా ధ్యాస పెట్టలేం. శరీరానికి తగినంత నిద్ర లేకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. ముఖ్యంగా బీపీ, షుగర్, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మనిషికి ఆహారం లేకపోయినా ఉంటాడేమో కానీ.. నిద్ర లేకపోతే మాత్రం చాలా కష్టం. ఒక మనిషికి ఖచ్చితంగా 7 నుంచి 8 గంటల నిద్ర అవసరం. అందులోనూ ఇంట్లో ఉండే వాళ్ల కంటే.. బయట పని చేసుకున్న వాళ్లకు సరైన నిద్ర లేకపోతే మరింత విసుగ్గా ఉంటుంది. ఇలా నిద్ర లేమి సమస్యలతో బాధ పడేవారు ఇప్పుడు చెప్పే చిట్కాలు ట్రై చేస్తే గాఢమైన నిద్ర వస్తుంది.

మనసును ప్రశాంతంగా ఉంచండి:

సాధారణంగా రాత్రి పూట పడుకునే ముందే రకరకాల ఆలోచనలు వస్తాయి. చాలా మంది వాటిని ఆలోచిస్తూ.. అలా చేయాల్సింది.. ఇలా చేద్దాం అని ప్లాన్స్ వేస్తారు. అంతేకాకుండా ఇతరులతో కలిసి చర్చిస్తారు. అలాంటివి ఆలోచనలు మానేసి మనసును ప్రశాంతంగా ఉంచండి.. కేవలం నిద్ర మీద ధ్యాస పెట్టండి.

ధ్యానం చేయండి:

నిద్ర లేమి సమస్యలతో బాధ పడేవారు రాత్రి పడుకునే ముందు ధ్యానం చేయడం చాలా మంచిది. ఓ అరగంట సేపు అయినా ధ్యానం చేస్తే.. మంచి నిద్ర పడుతుంది. అంత సమయం కుదరని వారు 10 నిమిషాలు అయినా కేటాయించండి.

ఇవి కూడా చదవండి

సెల్ ఫోన్స్‌కి దూరం:

రాత్రి సమయాల్లోనే ఎక్కువగా చాలా మంది చాటింగ్ చేయడం, ఫోన్లు మాట్లాడుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల నిద్ర సరిగా రాదు. ఉదయం లేవడానికి నిద్ర సరిపోక తలనొప్పి, వికారంగా ఉంటుంది. కాబట్టి మీరు పడుకోవాలి అనుకుంటున్నప్పుడు.. వీటికి దూరంగా ఉంచడం బెటర్.

దాల్చిన చెక్క పొడి:

మీరు రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చటి పాలలో కొద్దిగా దాల్చిన చెక్క పొడి కలిపి తీసుకోండి. ఇలా చేస్తే నిద్ర త్వరగా పడుతుంది. పాలు ఇష్టం లేని వారు గోరు వెచ్చటి నీటిలో దాల్చిన చెక్క పొడి, తేనె కలిపి తాగండి. రాత్రి పూట పడుకునే ముందు గోరు వెచ్చటి పాలు తాగినా నిద్ర క్లాలిటీ అనేది పెరుగుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

పవన్ కల్యాణ్‌తో ఒక్క ఫొటో ఇప్పించు..నిహారికకు హీరోయిన్ రిక్వెస్ట్
పవన్ కల్యాణ్‌తో ఒక్క ఫొటో ఇప్పించు..నిహారికకు హీరోయిన్ రిక్వెస్ట్
మంచి గాఢమైన నిద్ర కావాలా.. ఇలా చేస్తే చాలు..
మంచి గాఢమైన నిద్ర కావాలా.. ఇలా చేస్తే చాలు..
ఇంటి అద్దెలో సగం క్యాబ్‌కే ధారపోస్తున్నట్లు మహిళ ఆవేదన.! వీడియో..
ఇంటి అద్దెలో సగం క్యాబ్‌కే ధారపోస్తున్నట్లు మహిళ ఆవేదన.! వీడియో..
రాజకుమారుడు సినిమాకు 25 ఏళ్లు.. ఆ సీన్ చేయనని చెప్పిన మహేష్..
రాజకుమారుడు సినిమాకు 25 ఏళ్లు.. ఆ సీన్ చేయనని చెప్పిన మహేష్..
అరటి పండును కనుక ఇలా యూజ్ చేస్తే.. మీ ముఖంపై ముడతలు మాయం..
అరటి పండును కనుక ఇలా యూజ్ చేస్తే.. మీ ముఖంపై ముడతలు మాయం..
జిల్లేడు చెట్టుతో ఎన్ని ఉపయోగాలో తెలుసా..దీని ప్రతి భాగం అద్భుతమే
జిల్లేడు చెట్టుతో ఎన్ని ఉపయోగాలో తెలుసా..దీని ప్రతి భాగం అద్భుతమే
ఏసీ, కూలర్, ఫ్యాన్‌లకు ఎంత విద్యుత్తు ఖర్చవుతుందో తెలుసుకోండిలా!
ఏసీ, కూలర్, ఫ్యాన్‌లకు ఎంత విద్యుత్తు ఖర్చవుతుందో తెలుసుకోండిలా!
ప్రైవేట్ టీచర్ దారుణ హత్య.. ఏడేళ్ల తర్వాత సంచలన తీర్పు..
ప్రైవేట్ టీచర్ దారుణ హత్య.. ఏడేళ్ల తర్వాత సంచలన తీర్పు..
తెలంగాణాలో అల్పపీడనం ప్రభావం.! మరో రెండ్రోజులు భారీ వర్షాలు..
తెలంగాణాలో అల్పపీడనం ప్రభావం.! మరో రెండ్రోజులు భారీ వర్షాలు..
'నా మనసంతా నీచుట్టే తిరుగుతోంది'..కుమారుడి పుట్టిన రోజున హార్దిక్
'నా మనసంతా నీచుట్టే తిరుగుతోంది'..కుమారుడి పుట్టిన రోజున హార్దిక్