Health Care: సొంత వైద్యం చేసుకుంటే అంతే సంగతులు.. సీరియస్ వార్నింగ్ ఇస్తున్న వైద్యులు.. ఎందుకంటే..

సొంత వైద్యం.. ఎవరో చెప్పిన సోషల్ మీడియా డైట్ ఫాలో అవుతున్నారా? హెల్దీ లైఫ్ కాస్త హెల్త్ ఇష్యూ కు దారి తీస్తుందని అంటున్నారు డాక్టర్లు. కోవిడ్ తరువాత అందరిలోనూ హెల్త్ పై కేర్ పెరిగినప్పటికి.. చిన్న చిన్న వాటికి ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాపుల్లో షీట్ల కొద్ది ట్యాబ్లెట్స్ తీసుకోవడంతో లైఫ్ రిస్క్ లో పడుతుందని అంటున్నారు. వాటికి తోడు సోషల్ మీడియాలో ఎవరు పడితే వారు చెప్పే డైట్ ను ఫాలో అయ్యే వారి సంఖ్య పెరిగిందని, దీంతో దీర్ఘకాలిక సమస్యల భారిన పడుతున్న వారి సంఖ్య..

Health Care: సొంత వైద్యం చేసుకుంటే అంతే సంగతులు.. సీరియస్ వార్నింగ్ ఇస్తున్న వైద్యులు.. ఎందుకంటే..
Patient Own Medication
Follow us
Yellender Reddy Ramasagram

| Edited By: Shiva Prajapati

Updated on: Aug 31, 2023 | 1:57 PM

సొంత వైద్యం.. ఎవరో చెప్పిన సోషల్ మీడియా డైట్ ఫాలో అవుతున్నారా? హెల్దీ లైఫ్ కాస్త హెల్త్ ఇష్యూ కు దారి తీస్తుందని అంటున్నారు డాక్టర్లు. కోవిడ్ తరువాత అందరిలోనూ హెల్త్ పై కేర్ పెరిగినప్పటికి.. చిన్న చిన్న వాటికి ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాపుల్లో షీట్ల కొద్ది ట్యాబ్లెట్స్ తీసుకోవడంతో లైఫ్ రిస్క్ లో పడుతుందని అంటున్నారు. వాటికి తోడు సోషల్ మీడియాలో ఎవరు పడితే వారు చెప్పే డైట్ ను ఫాలో అయ్యే వారి సంఖ్య పెరిగిందని, దీంతో దీర్ఘకాలిక సమస్యల భారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిపుణులు. ఇంతకీ సొంత వైద్యంపై డాక్టర్ లు ఏం అంటున్నారు.?

కొన్నేళ్ల క్రితం నాటు వైద్యం వాడే వారు.. కానీ అప్పటి రోజులు అసలే కావు, అప్పుడు తీసుకున్న అహార అలవాట్లు వేరు ప్రస్తుతం మార్కెట్‌లో మనం తింటున్న ఫుడ్‌లో ఉన్న క్వాలిటీ వేరు. దీని కారణంగా హెల్త్ సున్నితం అయ్యింది. ఇలాంటి పరిస్థితుల్లో జ్వరం వచ్చినా, జలుబు చేసినా సొంత వైద్యంపై అధారపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరిగింది. అలా చేయడం ఫలితంగా అస్పత్రుల చుట్టు తిరగాల్సిన రోజులు వస్తున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం మనిషి లైఫ్ స్టైల్ బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ అని చెప్పుకుంటున్నారు. కోవిడ్ భారిన పడిన వారు ఎదో ఒక సమస్యతో ఇబ్బందులు పడుతున్న వారు కూడా ఉన్నారు. హెల్త్ పై కేర్ పెరిగినప్పటికి చాలా మందికి సమస్యలు వస్తే.. చిన్న దానికి డాక్టర్ ను సంప్రదించడం ఎందుకులే అని జనం లైట్ తీసుకుంటున్నారు. దీని కారణంగా అనారోగ్య సమస్యలు వస్తున్నాయని వైద్యులు చెప్తున్నారు.

ఎలాంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మార్కెట్ లో వివిధ మెడికల్ షాపుల నుంచి షీట్ల కొద్ది ట్యాబ్లెట్టు కొంటున్న వారి సంఖ్య పెరిగినట్లు డాక్టర్లు చెబుతున్నారు. దీంతో ఏ రోగానికి ఏ మందు వాడాలి ఏ మోతాదులో వాడాలి అనేది సంబందిచిన డాక్టర్ ని కలిస్తే చెప్పే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం సొంత వైద్యం, యూట్యూబ్ డైట్ ను ఫాలో అవుతున్న వారు అధికంగా హెల్త్ ఇష్యూతో బాధపడుతున్న వారు.. ఎక్కువ శాతం అస్పత్రులకు వస్తున్నట్లు చెబుతున్నారు.

కోవిడ్ తరువాత వయసుతో సంబంధం లేకుండా హెల్త్‌తో పాటు ఫిట్‌నెస్ పై ఇంట్రెస్ట్ పెరిగింది. ఫిట్‌నెస్ ఉండాలంటె జిమ్, యోగా , రన్నింగ్, వాకింగ్ ప్రాపర్ డైట్ ఉండాలని అనుకుంటున్నారు. దీంతో సోషల్ మీడియాలో విచ్చలవిడిగా యూట్యూబ్ డైట్ షెడ్యూల్ వెలుస్తున్నాయి. వాటిని గుడ్డిగా ఫాలో అవుతున్నారు జనం. ఎవరికో ఒకరికి డైట్ తో మేలు జరిగిందని, అది ప్రతి ఒక్కరికి మేలు చేస్తుందనే అలోచనతోనే జనం సొంత డైట్ ను ఫాలో అవుతున్నారని డాక్టర్ల స్టడీలో గుర్తించినట్లు స్పష్టం చేస్తున్నారు.

జిమ్ ట్రైనర్ చెప్పాడనో, లేక మిలెట్ ప్రాపర్ డైట్ అని రైస్ మానేసి మిలెట్స్ తినడమే పనిగా పెట్టుకోవడమో లేక లిక్విడ్ డైట్ బెస్ట్ అని ఇంకొందరు ఇల రకరకాల డైట్ ను ఫాలో అవుతూ ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. మార్కెట్ లో జ్యూసెస్ కు డిమాండ్ ఉంది. వెజిటెబుల్ జ్యూస్ అని, ఫ్రూట్ జ్యూస్ అని వాటిని పరిగడుపున తీసుకోవాలని రకరకాల రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. అలాంటి ప్రకటనలను ఒకటికి రెండు సార్లు అలోచన చేసి తీసుకుంటే బెటర్ అని అడ్వైజ్ చేస్తున్నారు డాక్టర్లు.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..