Finger Millet: రాగులతో డయాబెటీస్, కొలెస్ట్రాల్ కంట్రోల్.. ఇంకా ఎన్నో!
ప్రస్తుత కాలంలో రాగుల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం వీటిని ఎక్కువగా ఆహారంగా తీసుకుంటున్నారు. వీటిని ఫింగర్ మిల్లెట్ అని పిలుస్తారు. ఇతర ఆహారాల కంటే.. రాగులు చాలా బలవర్థకమైనవి. ఇందులో అనేక పోషకాలు ఉన్నాయి. క్యాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్, మినరల్స్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఎక్కువగా కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. రాగులతో ఎన్నో రకాల వంటలు తయారు చేస్తారు. రాగి సంగటి, అంబలి, లడ్డూలు..
ప్రస్తుత కాలంలో రాగుల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం వీటిని ఎక్కువగా ఆహారంగా తీసుకుంటున్నారు. వీటిని ఫింగర్ మిల్లెట్ అని పిలుస్తారు. ఇతర ఆహారాల కంటే.. రాగులు చాలా బలవర్థకమైనవి. ఇందులో అనేక పోషకాలు ఉన్నాయి. క్యాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్, మినరల్స్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఎక్కువగా కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. రాగులతో ఎన్నో రకాల వంటలు తయారు చేస్తారు. రాగి సంగటి, అంబలి, లడ్డూలు, రొట్టెలు వంటివి తయారు చేసుకోవచ్చు. రాగులు సహజమైన గ్లూటెన్ ఫ్రీ ఆహారం. ఇవి తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించుకోవచ్చు. రాగులు తినడం వల్ల చాలా రకాల దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి. మరి రాగులతో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎముకలు ఆరోగ్యం:
రాగుల్లో క్యాల్షియం అధికంగా కనిపిస్తుంది. క్యాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు బలంగా ఉండేందుకు సహాయపడుతుంది. పిల్లలకు ఇవ్వడం వల్ల వారిలో ఎముకలు ఆరోగ్యంగా, బలంగా ఉంటాయి. రాగులు ప్రతి రోజూ తీసుకోవడం వల్ల చాలా మంచిది.
డయాబెటీస్:
రాగులు తినడం వల్ల డయాబెటీస్ కూడా కంట్రోల్‌లో ఉంటుంది. వీటిల్లో ఫైబర్, ఇతర పోషకాలు మెండుగా ఉంటాయి. కాబట్టి వీటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అనేవి త్వరగా పెరగకుండా ఉంటాయి. ఇవి జీవ ప్రక్రియను తగ్గించడానికి సహాయ పడతాయి. దీంతో షుగర్ లెవల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి.
బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది:
రాగులు తీసుకోవడం వల్ల రక్త నాళాల్లో పేరుకుపోయిన చెడు కొవ్వు అనేది కరుగుతుంది. ఇతర శరీర భాగాల్లో పేరుకు పోయిన కొవ్వు కూడా కరుగుతుంది. దీంతో ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.
రక్త హీనత:
రాగుల్లో ఐరన్ శాతం అధికంగా లభిస్తుంది. కాబట్టి రక్త హీనత సమస్యతో ఇబ్బంది పడేవారు రాగులు తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయట పడొచ్చు.
వయస్సు తగ్గుతుంది:
ఈ మిల్లేట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు చాలా మెండుగా లభిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు తీసుకోవడం వల్ల వయస్సు అనేది చాలా వరకు తగ్గుతుంది. క్రమంగా రాగులను తీసుకుంటే.. వృద్ధాప్య ఛాయలు దరి చేరకుండా యంగ్‌గా కనిపిస్తారు. అదే విధంగా శరీరంలో రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతాయి. ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలానే ఉన్నాయి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..