Loneliness: మద్యపానం, సిగరెట్‌ల కంటే ఒంటరితనం చాలా ప్రమాదకరం.. ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్న ప్రజలు..
ఒంటరితనం ఆరోగ్య సంక్షోభంగా మారి.. వేగంగా అభివృద్ధి చెందుతోందని PGI మానసిక రోగ చికిత్స విభాగం వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది పట్టణ ప్రాంతాలకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా చేరుకుందని.. పల్లె వాసులు కూడా ఒంటరితనానికి గురవుతున్నారు. ఒంటరితనం సమస్య వృద్ధుల్లో ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. మధ్యతరగతి ప్రజలలో ఒంటరితనం స్థాయి చాలా ఎక్కువగా ఉందని ఈ పరిశోధన సమాచారం.
జగమంత కుటుంబం నాది అయినా ఏకాకి జీవితం నాది అంటూ ఓ సినీ కవి చెప్పినట్లు.. ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ఫేస్‌బుక్ లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో వేలాది మంది నెటిజన్లను ఫాలో అవుతున్నారు. అయినప్పటికీ చాలా మంది ప్రజలు నిజ జీవితంలో ఒంటరితనం బాధితులుగా మారుతున్నారు. ఈ ఒంటరితనం వల్ల మద్యం సేవించడం, పొగతాగడం, ఊబకాయం వంటి ఇతర వ్యాధులు వస్తున్నాయి. చాలా సందర్భాలలో మద్యపానం లేదా ధూమపానం కంటే ఒంటరితనం చాలా ప్రమాదకరం అని చండీగఢ్‌లోని PGI పరిశోధనలో వెల్లడైంది. వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చే రోగులలో కొంతమందిని ఈ పరిశోధనలో చేర్చారు. ఈ పరిశోధన గురించిన సమాచారం ఇండియన్ జర్నల్ ఆఫ్ సైకలాజికల్ మెడిసిన్‌లో ప్రచురించబడింది.
ఒంటరితనం ఆరోగ్య సంక్షోభంగా మారి.. వేగంగా అభివృద్ధి చెందుతోందని PGI మానసిక రోగ చికిత్స విభాగం వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది పట్టణ ప్రాంతాలకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా చేరుకుందని.. పల్లె వాసులు కూడా ఒంటరితనానికి గురవుతున్నారు. ఒంటరితనం సమస్య వృద్ధుల్లో ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. మధ్యతరగతి ప్రజలలో ఒంటరితనం స్థాయి చాలా ఎక్కువగా ఉందని ఈ పరిశోధన సమాచారం.
అనేక వ్యాధులకు కారణం అవుతోన్న ఒంటరితనం
ఒంటరితనం వల్ల శరీరంలో అనేక వ్యాధులు వస్తాయని పీజీఐలోని సైకియాట్రీ విభాగంలో డాక్టర్ అసిమ్ మెహ్రా చెబుతున్నారు. దీని వల్ల గుండె జబ్బులు, డిప్రెషన్, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువ. మద్యపానం, ధూమపానం లేదా ఊబకాయం వల్ల వచ్చే వ్యాధుల మాదిరిగానే ఒంటరితనం వల్ల ఇలాంటి వ్యాధులు వస్తున్నాయి.
ప్రజలు ఒంటరితనాన్ని భావోద్వేగాలతో మాత్రమే ముడిపెడతారని.. అయినప్పటికీ శరీరంపై కూడా తీవ్రమైన ప్రభావం చూపుతుందని డాక్టర్ మెహ్రా చెప్పారు. ఎందుకంటే ఒంటరితనం శరీరంలో ఒత్తిడిని ప్రేరేపిస్తుంది. ఇది కార్టిసాల్ స్థాయిలను పెంచుతుంది. ఒంటరితనం వలన ఒత్తిడి హార్మోన్ పెరుగుదల ఉంటుందని.. దీంతో శరీరంలో అనేక సమస్యలు ఏర్పడతాయని చెబుతున్నారు. ఒంటరితనం కారణంగా కార్టిసాల్ స్థాయి పెరగడంతో అనేక వ్యాధులకు కారణమవుతుంది. మద్యం సేవించడం లేదా ధూమపానం చేయడం కంటే శరీరంపై ఎక్కువ ప్రభావం చూపే వ్యాధులు ఇవి.
మానసిక ఆరోగ్యం క్షీణిస్తుంది
ఒంటరితనం పెద్ద సమస్యగా మారుతోందని మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ ఎ.కె.కుమార్ తెలిపారు. ఇది మానసిక ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. మానసిక ఆరోగ్యం క్షీణించిన తర్వాత, అది శరీరంపై ప్రభావం చూపుతుంది. ఒత్తిడి ఒక్కటే అనేక వ్యాధులకు కారణమవుతుంది. ఇంతకుముందు ది లాన్సెట్ చేసిన పరిశోధనలో ఒంటరితనం మానసిక ఆరోగ్యాన్ని మరింత దిగజార్చుతుందని.. మానసిక ఆరోగ్యం క్షీణించడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరగడంతో పాటు ఊబకాయం, హై BP వంటి సమస్యలకు దారితీస్తుందని వెల్లడించింది. గత కొన్నేళ్లుగా ఒంటరితనం సమస్య పెరుగుతోంది. ఈ సమస్య వృద్ధుల్లోనే కాదు యువతలో కూడా కనిపిస్తోంది.
రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది
ఒంటరితనం రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది, శరీరాన్ని అంటువ్యాధులతో పాటు ఇతర వ్యాధులకు గురి చేస్తుంది. ఇది రోగి రికవరీ ప్రక్రియను కూడా నెమ్మదించేలా చేస్తుంది. అంతేకాదు ఒంటరితనం వలన గాయాలు లేదా శస్త్రచికిత్స నుండి కోలుకోవడానికి సమయం పట్టవచ్చు. ఒంటరితనం నిద్రకు భంగం కలిగిస్తుంది. నిద్రలేమి కూడా అనేక వ్యాధులకు కారణమవుతుంది. దీనివల్ల గుండె జబ్బులు, బీపీ, షుగర్ ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది. అనేక సందర్భాల్లో సుదీర్ఘమైన ఒంటరితనం కూడా ఒక వ్యక్తిని ఆందోళన, నిరాశకు గురి చేస్తుంది. డిప్రెషన్ అనేది ఒక ప్రమాదకరమైన సమస్య. ఒకొక్కసారి ఆత్మహత్య కు కూడా పురిగోల్పుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..