- Telugu News Photo Gallery To prevent the utensils from smelling after cooking the meat, check here is details in Telugu
Kitchen Hacks: మాంసాహారం వండిన తర్వాత పాత్రలు వాసన రాకూడదంటే.. ఈ చిట్కాలు బెస్ట్!
సాధారణంగా ఇంట్లో మాంసాహార పదార్థాలు చికెన్, మటన్, గుడ్లు, చేపలు వండినప్పుడు పాత్రలు వాసన వస్తూ ఉంటాయి. రెండు, మూడు సార్లు పాత్రలు క్లీన్ చేసినా కూడా పాత్రల నుంచి నీచు వాసన వస్తూ ఉంటుంది. ఈ వాసన అంత త్వరగా వదలదు. ఇలా పాత్రల నుంచి నీచు వాసన రాకూడదంటే ఈ చిట్కాలు చక్కగా హెల్ప్ చేస్తాయి. నిమ్మకాయలతో పాత్రల నుంచి దుర్వాసనను తగ్గించవచ్చు. ఇందులో ఎసిడిక్ కంటెంట్ మెండుగా లభిస్తుంది. దీని వలన పాత్రల నుంచి..
Updated on: Sep 04, 2024 | 5:15 PM

సాధారణంగా ఇంట్లో మాంసాహార పదార్థాలు చికెన్, మటన్, గుడ్లు, చేపలు వండినప్పుడు పాత్రలు వాసన వస్తూ ఉంటాయి. రెండు, మూడు సార్లు పాత్రలు క్లీన్ చేసినా కూడా పాత్రల నుంచి నీచు వాసన వస్తూ ఉంటుంది. ఈ వాసన అంత త్వరగా వదలదు. ఇలా పాత్రల నుంచి నీచు వాసన రాకూడదంటే ఈ చిట్కాలు చక్కగా హెల్ప్ చేస్తాయి.

నిమ్మకాయలతో పాత్రల నుంచి దుర్వాసనను తగ్గించవచ్చు. ఇందులో ఎసిడిక్ కంటెంట్ మెండుగా లభిస్తుంది. దీని వలన పాత్రల నుంచి వాసనే పోతుంది. నిమ్మరసం లేదా నిమ్మ చెక్కతో పాత్రలను తోమితే వాసన పోతుంది.

పాత్రల నుంచి వచ్చే దుర్వాసన పోగొట్టడంలో వెనిగర్ కూడా ఎంతో ఎఫెక్టీవ్‌గా పని చేస్తుంది. కిచెన్ హ్యాక్స్‌గా వెనిగర్ చక్కగా పని చేస్తుంది. నీటిలో కొద్దిగా వెనిగర్ కలిపి పాత్రల్లో పోసి.. ఒకసారి శుభ్రం చేస్తే.. వాసన పోతుంది.

బేకింగ్ సోడాతో కూడా పాత్రల నుంచి వచ్చే వాసనను పోగొట్టవచ్చు. కొద్దిగా బేకింగ్ సోడా తీసుకుని అందులో నీటిని కలిపి.. నాన్ వెజ్ వండిన పాత్రల్లో వేసి క్లీన్ చేస్తే.. వాసన అనేది తగ్గుతుంది.

శనగ పిండితో కూడా మనం పాత్రల నుంచి వచ్చే వాసనను పోగొట్ట వచ్చు. శనగ పిండితో కొద్దిగా సర్ఫ్ కలిపి పాత్రలను క్లీన్ చేయాలి. ఇలా చేయడం వల్ల దుర్వాసన తగ్గుతుంది. అలాగే పాత్రలు కడిగిన తర్వాత ఎండలో పెట్టడం వల్ల కూడా వాసన తగ్గుతుంది.




