Tirupati: సమస్త మానవాళిని రక్షిస్తున్న శ్రీవారికి కృతజ్ఞతగా జరుపుకునే ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు.. వాహన సేవల పూర్తి వివరాలు మీ కోసం..

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల తిరుపతి క్షేత్రం అంగరంగ వైభవంగా ముస్తాబవుతుంది. ప్రతి హిందువు తన జీవితంలో ఒక్కసారైనా చూడాలని కోరుకునే స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు రానున్న నేపధ్యంలో అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. శరన్నవరాత్రుల సమయంలో జరిగే ఈ బ్రహ్మొత్సవాలను కనులారా దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అధికార యంత్రం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ ఈవో శ్రీ జె. శ్యామలరావు చెప్పారు. అక్టోబరు 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరగనున్న సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో అక్టోబరు 4న ధ్వజారోహణం కార్యక్రమం సమయంలో సిఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీ వేంకటేశ్వర స్వామికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అయితే ఈ బ్రహ్మోత్సవాలు ఎలా మొదలయ్యాయి.. స్వామివారు ఏ రోజున ఏ వాహనంలో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇవ్వన్నారో తెలుసుకుందాం..

|

Updated on: Sep 04, 2024 | 5:51 PM

ప్రతి సంవత్సరం ఆశ్వయుజ శుద్ద విదియ మొదలుకొని ఆశ్వయుజ శుద్ద దశమి వరకు అంటే దసరా నవరాత్రుల సమయంలో స్వామివారికి వార్షిక బ్రహ్మోత్సవాలను జరుపుతారు. ఈ ఉత్సవాలను మొదటగా  బ్రహ్మదేవుడు జరిపినట్లు పురాణాల కథనం. సమస్త మానవాళిని రక్షిస్తున్నందుకు  శ్రీ వేంకటేశ్వర స్వామికి  కృతజ్ఞతా పూర్వకంగా సృష్టి కర్త బ్రహ్మదేవుడు మొదటి సారి పవిత్ర పుష్కరిణి ఒడ్డున ఈ ఉత్సవాలను జరిపాడని ప్రతీతి. అందుకనే ఈ ఉత్సవాలకు బ్రహ్మోత్సవాలు అనే పేరుతో నేటికీ ప్రతి సంవత్సవం జరుపుతున్నారు. (photo credit: TTD)

1 / 11

బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ ఆశ్వయుజ శుద్ద పాడ్యమి తిది సాయంత్రం సమయంలో విష్వక్సేన పూజతో చేస్తారు. అంటే ఈ ఏడాది అక్టోబరు 3వ తేదీన సాయంత్రం స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ  చేయనున్నారు.  (photo credit: TTD)

2 / 11
అక్టోబరు 4న ధ్వజారోహణం కార్యక్రమం నిర్వహిస్తారు. దేవలోకం వెళ్ళి దేవతలను ఈ ఉత్సవానికి ఆహ్వానించమంటూ గరుడ పతాకాన్ని ధ్వజస్థంభంపై ఎగురవేస్తారు. ఈ రోజు రాత్రి పెద్దశేష వాహనం పై మలయప్ప స్వామిని శ్రీదేవి, భూదేవి సమేతంగా మాఢవీధుల్లో  ఊరేగుతూ భక్తులను కటాక్షించనున్నారు.  (photo credit: TTD)

3 / 11
బ్రహ్మోత్సవాల్లో 2వరోజు అంటే అక్టోబరు 5వ తేదీ ఉదయం స్వామి వారు చిన్న శేష వాహనం పై ఊరేగుతారు. చిన్న శేషుడు వాసుకి సర్పానికి గుర్తు 5 తలలుంటాయి. రాత్రి 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇస్తారు.  (photo credit: TTD)

4 / 11
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 3వ రోజు అంటే అక్టోబరు  6వ తేదీ ఉదయం స్వామివారికి సింహం వాహన సేవ ఉండనుంది. సింహం శక్తికి మారుపేరు. రాత్రి స్వామిని ముత్యాల పందిరి పై విహరించనున్నారు, ముత్యాలు స్వచ్చతకు ప్రతిరూపం.  (photo credit: TTD)

5 / 11
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 4వ రోజు అక్టోబరు 7వ తేదీ ఉదయం శ్రీవారు తన దేవేరులతో కలిసి కల్పవృక్ష వాహనంపై ఊరేగనున్నారు. కోరిన కోర్కెలు తీర్చే కల్ప వృక్ష వాహన సేవను దర్శించడం వలన కోరిన కోర్కెలు తీరతాయని నమ్మకం. సాయంత్రం స్వామివారు సర్వ భూపాల వాహనం పై అన్ని లోకాలనూ పాలించేది నేనే అంటూ భక్తులకు దర్శనం ఇస్తాడు.  (photo credit: TTD)

6 / 11
5వ రోజు అక్టోబరు 8వ తేదీ ఉదయం మోహినీ అవతారంలో స్వామి వారు జగన్మోహనుడిగా దర్శనం ఇవ్వనున్నారు. సాయంత్రం శ్రీ మన్నారాయణునిగా తన వాహనమైన గరుడవాహనం పై ఊరేగుతాడు.  (photo credit: TTD)

7 / 11
బ్రహామోత్సవల్లో 6వ రోజు అక్టోబరు  9వ తేదీ ఉదయం హనుమంత వాహనం పై ఊరేగుతూ స్వామి వారు  కనుల పండువ చేయనున్నాడు. సాయంత్రం గజ వాహనంపై తన దేవేరులతో కలిసి శ్రీవారు మాడ వీధుల్లో విహరించనున్నారు.  (photo credit: TTD)

8 / 11
వార్షిక బ్రహ్మోత్సవాల్లో 7వ రోజు అక్టోబరు 10 వ తేదీ ఉదయం సూర్యప్రభ వాహనంపై ఊరేగనున్నారు.  సాయంత్రం చంద్రప్రభ వాహనం పై స్వామి దర్శనమిస్తాడు  (photo credit: TTD)

9 / 11
అక్టోబరు 11 వ తేదీ ఉదయం స్వామి బంగారు రధం పై ఊరేగుతాడు. అదే రధోత్సవం. రధాన్ని భక్తులందరూ గోవిందనామ స్మరణ చేస్తూ లాగుతారు. రథంపై ఊరేగే స్వామిని దర్శించుకుంటే మరు జన్మ ఉండదని విశ్వాసం. రాత్రి స్వామి వారు అశ్వ వాహనంపై ఊరేగుతారు. (photo credit: TTD)

10 / 11
అక్టోబరు 12 వ తేదీ బ్రహ్మోతవల్లో 9వ రోజు అంటే చివరి రోజు ఉదయం శ్రీదేవీ, భూదేవీ సహిత స్వామి వారు చక్రస్నానం చేయనున్నారు. ఈ సమయంలో ఆ పుష్కరిణిలో మునకవేసిన వారు సర్వ పాప విముక్తులవుతారని ప్రగాఢ విశ్వాసం. సాయంకాలం ధ్వజావరోహణం నిర్వహిస్తారు. ఇలా గరుడ పతాకాన్ని దించడంతో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు సమాప్తమౌతాయి. (photo credit: TTD)

11 / 11
Follow us