AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వర్క్‌ ఫ్రం హోం చేస్తున్నారా..! కచ్చితంగా ఈ విషయాలు గుర్తుంచుకోండి.. లేదంటే ఆస్పత్రికే..?

Work From Home: నేటి కాలంలో మొబైల్ ఫోన్ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ సెల్‌ ఫోన్‌ మరిచిపోయి ఎక్కడికైనా వెళితే మన బాడీలో ఏదోపార్ట్

వర్క్‌ ఫ్రం హోం చేస్తున్నారా..! కచ్చితంగా ఈ విషయాలు గుర్తుంచుకోండి.. లేదంటే ఆస్పత్రికే..?
Work From Home
uppula Raju
|

Updated on: Sep 01, 2021 | 6:54 PM

Share

Work From Home: నేటి కాలంలో మొబైల్ ఫోన్ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ సెల్‌ ఫోన్‌ మరిచిపోయి ఎక్కడికైనా వెళితే మన బాడీలో ఏదోపార్ట్ మిస్సయినట్లుగా భావిస్తాం. అంతగా అడిక్ట్ అయ్యారు జనాలు. అయితే ఆందోళన కలిగించే విషయం ఏంటంటే మొబైల్ ఫోన్‌లపై ఆధారపడటం యువతకు మాత్రమే కాదు పిల్లలకు కూడా చాలా ప్రమాదకరం. నేటి కాలంలో చిన్న పిల్లలు కూడా గంటల తరబడి మొబైల్ ఫోన్‌లలో నిమగ్నమై ఉండటం సర్వసాధారణమైపోయింది. ఇది వారి ఆరోగ్యానికి చాలా హానికరం.

చాలా గంటలు స్క్రీన్ ముందు కూర్చోవడం ప్రమాదకరం కరోనా దయ వల్ల అందరు వర్క్‌ ఫ్రం హోం చేస్తున్నారు. దీంతో మొబైల్‌, ల్యాప్‌టాప్ వాడకం మరీ ఎక్కువైంది. చాలా గంటలపాటు స్క్రీన్‌ ముందు కూర్చోవాల్సి వస్తోంది. అందువల్ల చాలా మందికి కళ్ల సమస్యలు వస్తున్నాయి. ఇంకా చాలా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. మీకు అవసరం లేనప్పుడు మొబైల్, ల్యాప్‌టాప్‌కి దూరంగా ఉంటే చాలా మంచిది. లేదంటే ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది.

వర్క్‌ ఫ్రం హోం చేస్తున్నప్పుడు ఈ విషయాలు గుర్తుంచుకోవాలి.. ఎక్కువ సమయం స్క్రీన్ ముందు గడపటం వల్ల మనకు తెలియకుండానే ఎక్కువ ఆహారాన్ని తింటాం. దీంతో ఇది అనేక ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. ముఖ్యంగా బరువు విపరీతంగా పెరుగుతారు. నిద్ర సమస్యలు ఏర్పడుతాయి. మన మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. సోషల్ మీడియా వాడటం మంచిదే కానీ పరిమితంగా ఉండాలి. పనిచేస్తున్నప్పుడు మధ్యలో కొంత సమయం విరామం తీసుకుంటూ ఉండాలి. ఈ సమయంలో మీరు ఇంట్లో వాకింగ్‌ చేయాలి. చిన్న చిన్న వ్యాయామాలు, యోగా చేస్తే మంచిది.

Micro Irrigation Scheme: రైతులకు శుభవార్త..! మైక్రో ఇరిగేషన్ స్కీమ్ కింద వీటికి సబ్సిడీ..

Beauty Tips: చర్మం ముడతలు పడుతుందని ఫీలవుతున్నారా..! ఈ 3 పండ్లతో తయారు చేసిన ఫేస్ ప్యాక్‌ ట్రై చేయండి..

IPL 2022: ఐపీఎల్‌ 2022లో రెండు కొత్త జట్లు.. 10 టీంలు 74 మ్యాచులు.. ఆందోళన వ్యక్తం చేస్తోన్న ఐసీసీ.. ఎందుకో తెలుసా?