AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Micro Irrigation Scheme: రైతులకు శుభవార్త..! మైక్రో ఇరిగేషన్ స్కీమ్ కింద వీటికి సబ్సిడీ..

Micro Irrigation Scheme: రైతులు మైక్రో ఇరిగేషన్ వ్యవస్థతో తక్కువ నీటితో ఎక్కువ పంటలను ఉత్పత్తి చేయవచ్చు. దీనివల్ల నీటి పొదుపుతో పాటు పంటలకయ్యే ఖర్చు కూడా

Micro Irrigation Scheme: రైతులకు శుభవార్త..! మైక్రో ఇరిగేషన్ స్కీమ్ కింద వీటికి సబ్సిడీ..
Drip Irrigation
uppula Raju
|

Updated on: Sep 01, 2021 | 6:13 PM

Share

Micro Irrigation Scheme: రైతులు మైక్రో ఇరిగేషన్ వ్యవస్థతో తక్కువ నీటితో ఎక్కువ పంటలను ఉత్పత్తి చేయవచ్చు. దీనివల్ల నీటి పొదుపుతో పాటు పంటలకయ్యే ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు. ఈ పథకం కింద ప్రభుత్వం చెరువుల నిర్మాణం, సోలార్ పంపులు, మినీ స్ప్రింక్లర్లు, డ్రిప్పుల నిర్మాణానికి భరోసా ఇస్తుంది. రైతు సంఘాలు ఈ స్కీంని ఉపయోగించుకొని సబ్సిడీ పొందాలని వ్యవసాయ అధికారులు కోరుతున్నారు. అంతేకాదు ఖర్చు నుంచి కూడా భారం తగ్గుతుంది.

ప్రయోజనం ఎలా పొందవచ్చు.. రైతులు వ్యక్తిగతంగా లేదా ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది రైతులు కలిసి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. వ్యక్తిగత రైతులకు వాటర్ ట్యాంక్ నిర్మాణంపై 70 శాతం, సోలార్ పంపుపై 75 శాతం, మినీ స్ప్రింక్లర్, డ్రిప్‌పై 85 శాతం సబ్సిడీ ఇస్తుంది. అదేవిధంగా వాటర్ ట్యాంక్ నిర్మాణంపై రైతుల బృందానికి 85 శాతం, సోలార్ పంపుపై 75 శాతం, మినీ స్ప్రింక్లర్ లేదా డ్రిప్‌పై 85 శాతం సబ్సిడీ అందిస్తుంది. ఒక్కసారి ఈ ప్రయోగం విజయవంతమైతే రైతులకు చాలా బాధలు తగ్గుతాయి.

మీరు సబ్సిడీ వాటాను ఎప్పుడు పొందుతారు? వాటర్ ట్యాంక్ తవ్వకం పూర్తయిన తర్వాత 20 శాతం, వాటర్ ట్యాంక్ నిర్మాణం పూర్తయ్యాక 40 శాతం, లబ్ధిదారుల ప్రాంతంలో మైక్రో ఇరిగేషన్ సిస్టమ్ ఏర్పాటు తర్వాత 40 శాతం సబ్సిడీ అందుతుంది. సూక్ష్మ నీటిపారుదల అనేది 25 ఎకరాల భూమిలో ప్రయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ పథకం కింద 99 శాతం వ్యయం ప్రభుత్వం భరిస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం కోసం వివరణాత్మక సమాచారాన్ని విభాగం www.cadaharyana.nic.in వెబ్‌సైట్ నుంచి తెలుసుకోవచ్చు.

Beauty Tips: చర్మం ముడతలు పడుతుందని ఫీలవుతున్నారా..! ఈ 3 పండ్లతో తయారు చేసిన ఫేస్ ప్యాక్‌ ట్రై చేయండి..

One Plus Ear Buds: బయటి శబ్దాలు వినపడవు.. సూపర్ ఫీచర్స్‌తో ఆకట్టుకుంటున్న వన్‌ప్లస్ ఇయర్ బడ్స్ ప్రో.. ధరెంతో తెలుసా?

Chiranjeevi : తమిళనాడు సీఎం స్టాలిన్‌ను కలిసిన మెగాస్టార్ చిరంజీవి..