Chiranjeevi : తమిళనాడు సీఎం స్టాలిన్‌ను కలిసిన మెగాస్టార్ చిరంజీవి..
మెగాస్టార్ చిరంజీవి నేడు తమిళ నాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. నేడు చెన్నై బయలు దేరి వెళ్లిన మెగాస్టార్ చిరంజీవి ముఖ్యమంత్రి స్టాలిన్‌ను..
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి నేడు తమిళ నాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. నేడు చెన్నై వెళ్లిన మెగాస్టార్ చిరంజీవి ముఖ్యమంత్రి స్టాలిన్‌ను ఆయన ఆఫీస్‌లో కలిశారు. ఆయనతోపాటు స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ కూడా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీకి స్టాలిన్ ఫ్యామిలీకి మొదటి నుంచి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే. మరో వైపు స్టాలిన్ పాలన పై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు. స్టాలిన్ పాలన దేశంలోని అన్ని రాష్ట్రాలకూ ఆదర్శమంటూ పొగడ్తలతో ముంచెత్తారు పవర్ స్టార్. మాటలే కాదు.. చేతల్లోనూ పాలన ఎలా ఉండాలో చూపిస్తున్నారని మెచ్చుకున్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
‘‘ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చేందుకు రాజకీయాలు చేయాలే తప్ప.. అధికారంలోకి వచ్చాక చేయకూడదు. ఆ విషయాన్ని మీరు మాటల్లోనే కాకుండా చేతల్లోనూ చేసి చూపిస్తున్నారు. మీ పాలన, పనితీరు తమిళనాడు ఒక్క దానికే కాదు.. దేశంలోని మిగతా రాష్ట్రాలకూ, రాజకీయ పార్టీలకూ ఆదర్శం, మార్గదర్శి. అంత మంచి పాలన అందిస్తున్న మీకు మనస్ఫూర్తిగా అభినందనలు’’ అంటూ స్టాలిన్ ను ప్రశంసించారు.
திரைப்பட நடிகர் @KChiruTweets அவர்கள் மாண்புமிகு தமிழ்நாடு முதலமைச்சர் @mkstalin அவர்களை சந்தித்துப் பேசினார். pic.twitter.com/g9MJyT4xME
— CMOTamilNadu (@CMOTamilnadu) September 1, 2021
To Hon. CM @mkstalin garu, pic.twitter.com/iIo0YMD1vT
— Pawan Kalyan (@PawanKalyan) August 31, 2021
మరిన్ని ఇక్కడ చదవండి :
Aadi Saikumar: ”అతిథి దేవోభవ” అంటున్న ఆది సాయి కుమార్.. ఆకట్టుకుంటున్న పోస్టర్..
భీమ్లా నాయక్ పుట్టినరోజుకు ముందుగానే పెద్ద ఎత్తున సందడి చేస్తున్న అభిమానులు..