Sanotosh Shoban’s Prem Kumar : సంతోష్ శోభన్ పెళ్లి కష్టాలు.. ఆకట్టుకుంటున్న ప్రేమ్ కుమార్ ఫస్ట్ గ్లిమ్స్ ..

కుర్రహీరో సంతోష్ శోభన్ ఇప్పుడిప్పుడే సక్సెస్ స్టోరీస్‌తో హీరోగా నిలబడుతున్నాడు. 'తాను నేను' అనే సినిమాతో హీరోగా పరిచయం అయిన ఈ యంగ్ హీరో 'పేపర్ బాయ్' సినిమాతో మంచి గుర్తిపు తెచ్చుకున్నాడు.

Sanotosh Shoban's Prem Kumar : సంతోష్ శోభన్ పెళ్లి కష్టాలు.. ఆకట్టుకుంటున్న ప్రేమ్ కుమార్ ఫస్ట్ గ్లిమ్స్ ..
Prem Kumar
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 01, 2021 | 5:14 PM

Sanotosh Shoban’s Prem Kumar : కుర్రహీరో సంతోష్ శోభన్ ఇప్పుడిప్పుడే సక్సెస్ స్టోరీస్‌తో హీరోగా నిలబడుతున్నాడు. ‘తాను నేను’ అనే సినిమాతో హీరోగా పరిచయం అయిన ఈ యంగ్ హీరో ‘పేపర్ బాయ్’ సినిమాతో మంచి గుర్తిపు తెచ్చుకున్నాడు. సినిమాల విషయాల్లో ఆచి తూచి అడుగులు వేస్తూ దూసుకుపోతున్నాడు సంతోష్. ఇటీవలే ‘ఏక్ మినీ కథ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సంతోష్. ఓటీటీ వేదికగా విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా తర్వాత మారుతి దర్శకత్వంలో ‘మంచి రోజులు వచ్చాయి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా మెహరీన్ నటిస్తుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతోపాటుగా ‘ప్రేమ్ కుమార్’ అనే సినిమా చేస్తున్నాడు శోభన్. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాను అభిషేక్ మహర్షి అనే డెబ్యూ డైరెక్టర్  డైరెక్ట్ చేస్తున్నాడు.

ఇప్పటికే విడుదలైన ‘ప్రేమ్ కుమార్’ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ఈ క్రమంలో తాజాగా ఫస్ట్ గ్లిమ్స్‌ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో పెళ్లి సమస్యతో సతమతమయ్యే  కుర్రాడిగా సంతోష్ కనిపించనున్నాడు. ఈ ఫస్ట్ గ్లిమ్స్ ఆకట్టుకుంటుంది. ‘ప్రేమ్ కుమార్’ లో పెళ్లి అవ్వడం లేదనే ఫ్రస్ట్రేషన్‌లో ఉండే కుర్రాడిగా నటించినట్లు ఈ వీడియో చూస్తే తెలుస్తోంది. అలాగే సినిమాలో కావాల్సినంత వినోదం ఉంటుందని అర్ధమవుతుంది. ఈ సినిమాలో సంతోష్ శోభన్ సరసన రాశీ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. సారంగ ఎంటర్టైన్మెంట్స్ పై.లి. పతాకంపై శివప్రసాద్ పన్నీరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనంత్ శ్రీకర్ సంగీతం అందిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Aadi Saikumar: ”అతిథి దేవోభవ” అంటున్న ఆది సాయి కుమార్.. ఆకట్టుకుంటున్న పోస్టర్..

భీమ్లా నాయక్ పుట్టినరోజుకు ముందుగానే పెద్ద ఎత్తున సందడి చేస్తున్న అభిమానులు..

 తాళిబొట్టుతో ఫోటోషూట్ చేసిన గ్లోబల్ స్టార్.. కుర్రాళ్ల మతిపొగొడుతున్న ప్రియాంక.. నెట్టింట్లో ఫోటోలు వైరల్..