స్టార్ హీరోలు, హీరోయిన్స్ ఫోటోలు ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. న్యూ స్టిల్స్ మాత్రమే కాదు చిన్ననాటి ఫోటోలు కూడా నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉంటాయి. ఇక ఈ ఫొటోలో కనిపిస్తున్న చిన్నోడు ఇప్పుడు అంతులేని అభిమానులను సొంతం చేసుకున్న స్టార్ హీరో. ఆ పేరు వింటే అభిమానులకు వైబ్రేషన్స్.. ఆయన కనిపిస్తే సెన్షేషన్.. ఆయన సినిమా విడుదలవుతుందంటే సెలబ్రేషన్. ఆయన క్రేజ్ ఎవరెస్ట్.. ఆయన స్టైల్ ఎప్పటికప్పుడు నయా ట్రెంట్ సెట్. ఇప్పటికే ఆయన ఎవరో మీరు గుర్తుపట్టేసి ఉంటారు.. రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేస్తూ.. తన నిప్పుకణికలాంటి మాటలతో.. జడివానలాంటి ప్రశ్నలతో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఆయన ఎవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.
ఉద్యమకారుడి పొగరతడు.. కవి కలానికున్న ఆవేశం అతడు.. ! సైనికుడి కత్తికున్న పదునతడు.. పేలిన తూటాకున్న వేగం అతడు.. !.. రైతు నాగలి కొనతడు..! అంజనా పుత్రుడు..! చిరు సోదరుడు.. ! కోట్ల మంది ఇలవేల్పుడు..! పవన్ కళ్యాణ్ నామధేయుడు.సెప్టెంబర్ 2 అభిమానులకు పెద్ద పండగ.. పవర్ స్టార్ పుట్టిన రోజు ఆరోజు. పవన్ పుట్టిన రోజును వరల్డ్ వైడ్ ట్రెండ్ చేయాలనీ అభిమానులు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు ఫ్యాన్స్. చేసిన కొన్ని సినిమాలతోనే కొండంత క్రేజ్‌ను సంపాదించుకున్న పవన్… ‘ఇక సినిమాలు చేయను రాజకీయాల్లోనే నా జీవితం’ అని ఓ ఫైన్ డే ఓ అనౌన్స్ చేశారు. దీంతో ఉసూరుమన్నారు అభిమానులందరూ… ఉండబట్టలేక సినిమాలు చేయాల్సిందే అని పట్టుబట్టారు మరికొందరు. మరి వారి పట్టో.. లేదా పవన్ కనికట్టో తెలియదు కాని మూడేళ్ళ తరువాత తిరిగి వకీల్ సాబ్ గా మన ముందుకు వచ్చారు పవన్. ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఇక ఇప్పుడు వరుస సినిమాలతో అభిమానులను అలరించడానికి రెడీ అయ్యారు పవర్ స్టార్.
మరిన్ని ఇక్కడ చదవండి :