AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beauty Tips: చర్మం ముడతలు పడుతుందని ఫీలవుతున్నారా..! ఈ 3 పండ్లతో తయారు చేసిన ఫేస్ ప్యాక్‌ ట్రై చేయండి..

Beauty Tips: ముడతలు పడే చర్మం కోసం మీరు ఇంట్లోనే తయారు చేసిన ఫేస్ ప్యాక్‌లను ఉపయోగించవచ్చు. పాలు, తేనె, పిండి, పసుపు మొదలైనవి కాకుండా మీరు పండ్ల

Beauty Tips: చర్మం ముడతలు పడుతుందని ఫీలవుతున్నారా..! ఈ 3 పండ్లతో తయారు చేసిన ఫేస్ ప్యాక్‌ ట్రై చేయండి..
Beauty Tips
uppula Raju
|

Updated on: Sep 01, 2021 | 6:02 PM

Share

Beauty Tips: ముడతలు పడే చర్మం కోసం మీరు ఇంట్లోనే తయారు చేసిన ఫేస్ ప్యాక్‌లను ఉపయోగించవచ్చు. పాలు, తేనె, పిండి, పసుపు మొదలైనవి కాకుండా మీరు పండ్ల నుంచి తయారు చేసిన ఫేస్ ప్యాక్‌లను ట్రై చేయాలి. ఇది అనేక చర్మ సంబంధిత సమస్యలను వదిలించడానికి సహాయపడుతుంది. ఇవి టాన్‌, మొటిమలను తొలగిస్తాయి. పండ్ల నుంచి ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

పుచ్చకాయ: పుచ్చకాయలో దాదాపు 90 శాతం నీరు ఉంటుంది. పుచ్చకాయ మీ చర్మాన్ని తేమగా, మృదువుగా చేస్తుంది. 1. మీ చర్మాన్ని మెరిసేలా చేయడానికి ఒక గిన్నెలో సమాన పరిమాణంలో పుచ్చకాయ రసం, తేనె లేదా పచ్చి పాలు తీసుకోండి. వీటిని బాగా కలిపి మీ ముఖం, మెడపై అప్లై చేసి 30 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. 2. నిమ్మరసంతో పాటు పుచ్చకాయ రసాన్ని ఉపయోగించి ఎక్స్‌ఫోలియేటింగ్ మాస్క్ తయారు చేయండి. మీ చర్మంపై సమానంగా అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడిగేయండి. 3. మీ చర్మాన్ని మెరుగుపరచడానికి, పుచ్చకాయ, దోసకాయ గుజ్జును సమాన పరిమాణంలో తీసుకోవడం ద్వారా మాస్క్ తయారు చేసుకోండి. చర్మంపై అప్లై చేసి 15-20 నిమిషాల తర్వాత కడిగేయండి.

బొప్పాయి: బొప్పాయిలో విటమిన్ ఎ, బి, సి పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది. ఇది మీ చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడుతుంది. 1. కొద్దిగా పండిన బొప్పాయిని ఒక గిన్నెలో వేసి ఇందులో అర టీస్పూన్ బాదం నూనెను మిక్స్ చేసి పొడి చర్మంపై అప్లై చేయండి. మాయిశ్చరైజేషన్ కోసం 10-15 నిమిషాల తర్వాత కడిగేయండి. 2. పిగ్మెంటేషన్ తగ్గించడానికి పండిన బొప్పాయికి నిమ్మరసం, చిటికెడు పసుపు కలపాలి. దీన్ని చర్మానికి అప్లై చేసి ఆరిన తర్వాత కడగాలి. 3. బొప్పాయి స్క్రబ్ చేయడానికి పండిన బొప్పాయి, పెరుగు, కొన్ని చుక్కల నిమ్మరసం కలపండి. చర్మంపై అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయండి 5-10 నిమిషాల తర్వాత కడిగేయండి.

పైనాపిల్‌: ఇందులో విటమిన్లు బి 6, సి పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి సహాయపడుతుంది. 1. పైనాపిల్ గుజ్జు, గ్రామ్ పిండిని సమాన భాగాలుగా కలపడం ద్వారా పైనాపిల్ స్క్రబ్ తయారు చేయండి. బాగా కలిపి ఆ పేస్ట్‌ని మీ ముఖం, మెడపై అప్లై చేయండి.10-15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. 2. ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పాలతో రెండు పైనాపిల్ ముక్కలను కలపండి. దీన్ని మీ చర్మంపై అప్లై చేయండి. 30 నిమిషాల తర్వాత కడగండి. 3. పైనాపిల్ గుజ్జును ఒక టీస్పూన్ గ్రీన్ టీ పొడి, కొంత తేనెతో కలిపి ఒక మాస్క్ తయారు చేయండి. దీనిని మీ చర్మంపై అప్లై చేసి ఐదు నిమిషాల పాటు మృదువుగా మసాజ్ చేయండి. గోరువెచ్చని నీటితో కడిగేయండి.

AP Weather Alert: రాగల 3 రోజులలో ఏపీలో భారీ వర్షాలు.. విజయనగరం, విశాఖపట్టణం జిల్లాలకు భారీ వర్ష సూచన

IND vs ENG: నాలుగో టెస్ట్‌లో భారత్‌తో తలపడే జోరూట్ సేన ఇదే.. భారీ మార్పులతో ఓవల్ బరిలోకి!

సిద్దిపేట జిల్లా కొండపాకలో హైఓల్టేజ్ సీన్.. తహసీల్దారు ఆఫీసుకు నిప్పు పెట్టేందుకు మహిళారైతు యత్నం