AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: ఐపీఎల్‌ 2022లో రెండు కొత్త జట్లు.. 10 టీంలు 74 మ్యాచులు.. ఆందోళన వ్యక్తం చేస్తోన్న ఐసీసీ.. ఎందుకో తెలుసా?

జట్ల పెరుగుదల కారణంగా, ఐపీఎల్ సీజన్ పూర్తి కావడానికి ఎక్కువ రోజులు పట్టనుంది. ఇది అంతర్జాతీయ క్రికెట్‌పై ప్రభావం చూపుతుందని ఐసీసీ..

IPL 2022: ఐపీఎల్‌ 2022లో రెండు కొత్త జట్లు.. 10 టీంలు 74 మ్యాచులు.. ఆందోళన వ్యక్తం చేస్తోన్న ఐసీసీ.. ఎందుకో తెలుసా?
నేటి మ్యాచ్‌లు: సన్‌రైజర్స్ హైదరాబాద్ వెర్సస్ ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వెర్సస్ ఢిల్లీ క్యాపిటల్స్
Venkata Chari
|

Updated on: Sep 01, 2021 | 6:00 PM

Share

IPL 2022: వచ్చే సీజన్ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2022) లో రెండు కొత్త జట్లు ఎంటర్ కానున్నాయి. లీగ్ పాలక మండలి మంగళవారం ఈ బృందాలకు టెండర్ జారీ చేసిన సంగతి తెలిసిందే. టీమ్‌ల ప్రాథమిక ధర రూ .2,000 కోట్లుగా నిర్ణయించారు. బిడ్‌లు మూల ధర కంటే అనేక రెట్లు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో మొత్తం జట్ల సంఖ్య 10కి చేరుకోనుంది. ఫ్రాంచైజీల కొనుగోలుకు ప్రముఖ వ్యాపార దిగ్గజాలు పోటీ పడుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.

కనీస బడ్జెట్ రూ. 2188 కోట్లు.. ఐపీఎల్ టెండర్ ప్రకారం, కొత్త జట్టు వేలంలో పాల్గొనాలంటే కనీసం 300 మిలియన్ డాలర్ల (రూ .2,188 కోట్లు) బడ్జెట్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ప్రాథమిక ధరతో పాటు ప్రారంభ రుసుము కూడా ఉంటుంది. రూ. 10 లక్షలు చెల్లించి ఏ కంపెనీ అయిన బిడ్ డాక్యుమెంటును కొనుగోలు చేయవచ్చని లీగ్ అధికారులు తెలిపారు. గతంలో రెండు కొత్త జట్లకు కనీస ధరను రూ.1700 కోట్లుగా నిర్ణయించిన బీసీసీఐ, తాజాగా, ఆ ధరను 2 వేల కోట్లకు పెంచింది. దీంతో బీసీసీఐకి రూ. 5 వేల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది.

పది జట్లు.. 74 మ్యాచులు.. మొత్తం పది జట్లతో ఐపీఎల్ వచ్చే సీజన్‌లో 74 గేమ్స్ జరగనున్నాయి. బరిలో నిలవాలంటే ప్రతీ జట్టుకు తప్పనిసరిగా విజయం సాధించాల్సి ఉంటుంది. బీసీసీఐ వార్షిక ఆదాయం రూ. 729 కోట్లు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అయితే, జట్ల పెరుగుదల కారణంగా, ఐపీఎల్ సీజన్ పూర్తి కావడానికి ఎక్కువ రోజులు పట్టనుంది. ఇది అంతర్జాతీయ క్రికెట్‌పై ప్రభావం చూపుతుందని ఐసీసీ సహా అనేక దేశాలు ఆందోళన చెందుతున్నాయి.

వార్షిక టర్నోవర్ రూ. 3వేల కోట్లుంటేనే బిడ్‌కు అర్హత.. వార్షిక టర్నోవర్ రూ. 3వేల కోట్లు కలిగిన కంపెనీ మాత్రమే బిడ్‌లో పాల్గొనేందుకు అనుమతి ఉంది. కొత్త జట్ల వేదికలలో అహ్మదాబాద్, లక్నో, పూణె ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త జట్ల కోసం అదానీ గ్రూప్, ఆర్‌పీజీ సంజీవ్ గోయెంక గ్రూప్‌, ఫార్మా కంపెనీ టోరెంట్ సంస్థలు పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. మూడు సంస్థలు ఒక బృందంగా ఏర్పడి బిడ్‌ వేసేందుకు అనుమతి ఉంది. మూడు కంటే ఎక్కువ సంస్థలు కలవడానికి మాత్రం అనుమతిలేదు. ఎక్కువమంది ప్రేక్షకులకు అవకాశం ఉన్న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం, లఖ్‌నవూలోని ఎకానా స్టేడియాల వైపు ఫ్రాంఛైజీలు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. టెండర్ సమర్పించడానికి ఆసక్తి ఉన్న పార్టీలు టెండర్ వివరాలను పొందడానికి అక్టోబర్ 5 వరకు వేచి ఉండాలి. అక్టోబర్‌లోనే పూర్తి ఫలితాలు వెల్లడికానున్నాయి.

రెండవ సారి యూఏఈకి.. ఐపీఎల్ గత రెండు సీజన్లలో, కరోనా మహమ్మారితో పలు ఇబ్బందులను ఎదుర్కొంది. దీంతో 2020లో యూఏఈలో నిర్వహించారు. ఈ ఏడాది భారతదేశంలో లీగ్ పూర్తి చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. కానీ, సగం మ్యాచులు పూర్తయ్యా కరోనా కారణంగా వాయిదా పడింది. ఐపీఎల్ సీజన్ రెండవ దశ సెప్టెంబర్‌ 19 నుంచి యూఏఈలో మొదలుకానుంది.

Also Read:

IND vs ENG: నాలుగో టెస్ట్‌లో భారత్‌తో తలపడే జోరూట్ సేన ఇదే.. భారీ మార్పులతో ఓవల్ బరిలోకి!

Paid Post New Rules: ఇన్‌స్టా పోస్టులతో కోట్లు సంపాదిస్తున్న సెలబ్రిటీలు.. భారత్ నుంచి టాప్ ప్లేస్‌లో కోహ్లీ, ప్రియాంక చోప్రా, అక్షయ్ కుమార్

ICC Test Rankings: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో జో రూట్‌ నెంబర్‌ వన్.. కోహ్లీని అధిగమించిన రోహిత్‌ శర్మ