AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Soft Lips: చలికాలంలో పెదవులు పగిలే సమస్యా.. ఇలా చేస్తే మృదువైన పెదాలు మీ సొంతం

చలికాలం వచ్చిందంటే పెదవులు పగలడం సర్వసాధారణమైన విషయం. చలికి ఒళ్లంతా చర్మం పగులుతుంది కానీ పెదవులపై దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కొందరికైతే పెదవులు పగిలి రక్తం కారుతుంది, లిప్‌స్టిక్ వేస్తే అస్సలు బాగోదు. పెదాలు పగలకుండా బ్యూటీ ప్రొడక్ట్స్​ వాడాలంటే ఖర్చుతో ..

Soft Lips: చలికాలంలో పెదవులు పగిలే సమస్యా.. ఇలా చేస్తే మృదువైన పెదాలు మీ సొంతం
Lips
Nikhil
|

Updated on: Nov 24, 2025 | 4:49 PM

Share

చలికాలం వచ్చిందంటే పెదవులు పగలడం సర్వసాధారణమైన విషయం. చలికి ఒళ్లంతా చర్మం పగులుతుంది కానీ పెదవులపై దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కొందరికైతే పెదవులు పగిలి రక్తం కారుతుంది, లిప్‌స్టిక్ వేస్తే అస్సలు బాగోదు. పెదాలు పగలకుండా బ్యూటీ ప్రొడక్ట్స్​ వాడాలంటే ఖర్చుతో కూడుకున్న పని. అయితే కొన్ని చిట్కాలను పాటించి పగిలిన పెదాలను సున్నితంగా మార్చేయచ్చు. అసలు పెదవులు ఎందుకు పగులుతాయి, పెదాల్ని మృదువుగా మార్చే చిట్కాలేంటో తెలుసుకుందాం..

ఎందుకు పగులుతాయి..

పెదవులు పగలడానికి చాలా కారణాలు ఉంటాయి. చలికి పగలడం సాధారణం. కానీ కొందరికి సంవత్సరం మొత్తం పగిలే ఉంటాయి. అందుకు ముఖ్య కారణం డీహైడ్రేషన్​. నీళ్లు తక్కువ తాగడం వల్ల ఆ ప్రభావం పెదవులపై పడుతుంది. చల్లని గాలి, ఎసి, హీటర్ ఎక్కువగా వాడటం వల్ల కూడా పెదవులు పగులుతాయి. కొందరికి తరచూ పెదవులను నాలుకతో తడిపే అలవాటు ఉంటుంది. అందువల్ల కూడా పెదవులు చిట్లి రక్తం కారుతుంది. అంతేకాదు, విటమిన్​ బి, ఐరన్​, జింక్​ లోపం వల్ల కూడా పెదవులు పగులుతాయి. తక్కువ ధర లిప్​బామ్​లలో ఉండే పెట్రోలియం జెల్లీ కూడా పెదవులు పగిలేందుకు కారణం.

ఏం చేయాలి..

చిన్న బౌల్‌లో 1 టీస్పూన్ షుగర్, అర టీస్పూన్ తేనె కలిపి పెదవులపై 30 సెకన్లు సున్నితంగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల మృతకణాలు తొలిగిపోతాయి. మాశ్చరైజేషన్​ కోసం తాజా అరటి పండు ముక్కను పెదవులపై పది నిమిషాల పాటు రుద్ది రాత్రంతా అలాగే వదిలేసి ఉదయాన్నే శుభ్రంగా కడిగేయాలి. ఇలా చేయడం వల్ల పెదాల మీదున్న పగిలిన చర్మం పోయి మృదువుగా మారతాయి. రోజూ రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నెయ్యి పెదాల మీద రాసి పడుకున్నా మంచి ఫలితం ఉంటుంది. ఆవాల నూనె, తేనె కలిపి కూడా రాయవచ్చు.

పెదాల మెరుపు పెంచాలంటే శరీరం లోపల నుంచీ సమస్యను పరిష్కరించాలి. రోజూ ఉదయం ఒక టీస్పూన్ ఆముదము తాగితే శరీరం లోపలి నుంచి హైడ్రేషన్ అవుతుంది. పెదవులపై దానిమ్మ గింజలు రుద్దితే సహజంగా గులాబీ రంగులోకి మారతాయి. కొబ్బరి నూనెలో కొద్దిగా కర్పూరం వేసి రోజూ రాయడం వల్ల మృదువుగా మారతాయి. అలోవెరా జెల్​ని ఫ్రిజ్​లో పెట్టి తరచుగా పెదవులపై రాస్తే దీర్ఘకాలిక ఫలితం ఉంటుంది.

రోజుకి 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తాగితే శరీరం డీహైడ్రేషన్​ బారిన పడకుండా ఉంటుంది. లిప్​బామ్​ కొనేటప్పుడు బీస్​వాక్స్​, షియాబటర్​, కొకో బటర్​ ఉన్నవి ఎంచుకుంటే మంచి ఫలితం ఉంటుంది. చలికాలంలో మామిడి, నిమ్మరసం ఎక్కువగా తాగకూడదు. పెదవులు పగిలి మూలల్లో రక్తం కారుతూ ఉంటే విటమిన్​ లోపం లేదా ఫంగల్​ ఇన్​ఫెక్షన్ అయ్యే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితుల్లో వెంటనే డాక్టర్​ని సంప్రదించడం మంచిది. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఈ చిట్కాలను పాటించి మీ పెదాలను మృదువుగా మార్చుకోండి.

Follow Us