AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salt Water: పరగడుపున ఉప్పు నీళ్లు తాగితే శరీరంలో ఏం మార్పులు జరుగుతాయో తెలుసా?

ఉప్పు ఆరోగ్యానికి అంత మంచిది కాదనేది చాలామంది నిపుణులు చెబుతున్న మాట. ఉప్పు లేకుండా చేసే పలు వంటలు కూడా వచ్చేశాయి. ఉప్పు వల్ల అధిక రక్తపోటు వంటి సమస్యలు వస్తాయని వైద్యులు కూడా హెచ్చరిస్తున్నారు. అయితే మన శరీరానికి కావలసిన పోషకాలు ఉప్పులో ..

Salt Water: పరగడుపున ఉప్పు నీళ్లు తాగితే శరీరంలో ఏం మార్పులు జరుగుతాయో తెలుసా?
Salt Water1
Nikhil
|

Updated on: Nov 24, 2025 | 4:34 PM

Share

ఉప్పు ఆరోగ్యానికి అంత మంచిది కాదనేది చాలామంది నిపుణులు చెబుతున్న మాట. ఉప్పు లేకుండా చేసే పలు వంటలు కూడా వచ్చేశాయి. ఉప్పు వల్ల అధిక రక్తపోటు వంటి సమస్యలు వస్తాయని వైద్యులు కూడా హెచ్చరిస్తున్నారు. అయితే మన శరీరానికి కావలసిన పోషకాలు ఉప్పులో కూడా ఉంటాయి. శరీరంలో సోడియం స్థాయి తగ్గితే చాలా సమస్యలు ఎదురవుతాయి.

అయితే రిఫైన్డ్​ సాల్ట్​ మన ఆరోగ్యానికి హానికరం. రిఫైన్డ్​ ఉప్పు కాకుండా హిమాలయన్​ సాల్ట్​, రాక్​ సాల్ట్​, పింక్​ సాల్ట్​, అన్​రిఫైన్డ్​ సాల్ట్​ వాడటం మంచిది. ఉప్పులోని అయొడిన్​ థైరాయిడ్​ పనితీరును మెరుగుపరుస్తుంది. అయితే రోజూ పరగడపునే ఉప్పు కలిపిన నీళ్లు తాగడం మన ఆరోగ్యానికి ఎలాంటి ఫలితాలను ఇస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఎలా పనిచేస్తుంది..

రోజూ పరగడపున ఒక గ్లాసు ఉప్పు కలిపిన గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిఫుణులు. ఇది శరీరానికి ఒక పవర్​ బూస్టర్​లా పనిచేస్తుందంటున్నారు. ప్రాచీన కాలం నుంచీ ఉన్న ఈ చిట్కాని పాటించడం ఆరోగ్యానికి మంచిదని సూచిస్తున్నారు. ఉప్పు నీరులో సోడియం, పొటాషియం, క్లోరైడ్ వంటి ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో నీటి సమతుల్యతను కాపాడతాయి.

నరాలు, కండరాల పనితీరును మెరుగుపరుస్తాయి. ఉదయాన్నే ఉప్పు నీళ్లు తాగితే డీహైడ్రేషన్ సమస్యలు దూరమవుతాయి. జిమ్‌కి వెళ్ళేముందు తాగితే, వర్కౌట్ ఎనర్జీ డబుల్ అవుతుంది! పరిశోధనల ప్రకారం, ఈ ఎలక్ట్రోలైట్లు మన శరీరంలోని కణాలను రీచార్జ్ చేస్తాయి, ఫలితంగా మొత్తం రోజు ఫ్రెష్‌గా ఉంటాం. ఇది కేవలం ఒక డ్రింక్ కాదు.. శరీరానికి ఒక ఎనర్జీ బూస్టర్​లా పనిచేస్తుంది!

ఉప్పు నీళ్లు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. ఇది కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ (HCl) ఉత్పత్తిని పెంచుతుంది, జీర్ణ ఎంజైమ్‌లను స్టిమ్యులేట్ చేస్తుంది. ఫలితంగా ఆహారం సులభంగా జీర్ణమవుతుంది, పోషకాలు మెరుగ్గా శోషించబడతాయి. గ్యాస్‌ట్రిక్, మలబద్ధకం, బ్లోటింగ్ వంటి సమస్యలు దూరమవుతాయి. ఉప్పు నీరు శరీరంలోని మైక్రోస్కోపిక్ టాక్సిన్‌లను, ఫెకల్ మ్యాటర్‌ను ఫ్లష్ అవుట్ చేస్తుంది, ఇది నేచురల్ డిటాక్స్ మెథడ్​లా పనిచేస్తుంది!

చర్మ సమస్యలు ఎక్జిమా, స్కిన్ పసారియాసిస్ వంటివి తగ్గుతాయి, మినరల్స్ చర్మాన్ని హైడ్రేట్ చేస్తాయి. గొంతు నొప్పి, దగ్గు, జలుబు, అలర్జీ వంటి శ్వాసకోశ సమస్యలకు ఇది మంచి ఔషధంలా పనిచేస్తుంది. గొంతు నొప్పి ఉన్నప్పుడు ఉప్పునీటితో పుక్కిలిస్తే తక్షణ ఉపశమనం లభిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని కూడా బూస్ట్ చేస్తుంది, ఫలితంగా రోజువారీ ఇన్ఫెక్షన్‌లు తగ్గుతాయి.

ఎలా చేయాలి..

1 గ్లాసు గోరు వెచ్చని నీటిలో 1/4 టీస్పూన్ ఉప్పు కలిపి తాగాలి. హిమాలయన్ పింక్ సాల్ట్ లేదా ఆన్-రిఫైన్డ్ సాల్ట్ ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఉదయం పరగడపునే తాగాలి. అయితే అధిక రక్తపోటు, గుండె సమస్యలు ఉన్న వాళ్లు ఉప్పు నీటి జోలికి పోకపోవడమే మంచిది. అధిక మోతాదులో తాగితే దుష్ప్రభావాలు కలుగుతాయి. కావున మితంగా తాగితేనే మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం పోషకాహారం, వ్యాయామం తప్పనిసరిగా అలవాటుగా మార్చుకుంటే ఎలాంటి అనారోగ్యం దరిచేరదు.

NOTE: పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే జారీ చేయబడినవి.. వీటిని మేం దృవీకరించలేదు.. వీటిపై మీకు సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించండి.

Follow Us