Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Home Remedies: పగిలిన పాదాలకు ఇంట్లోనే చికిత్స.. ఈ టిప్స్‌ పాటించారంటే కోమలమైన పాదాలు మీ సొంతం

శీతాకాలంలో చలిగాలులు వీస్తాయి. దీనికి తోడు చలికాలంలో అనేక చర్మ సమస్యలు కూడా తలెత్తుతాయి. వాతావరణం పొడిగా ఉండటం వల్ల ఈ సమయంలో చర్మం పొడిబారుతుంది. ఫలితంగా చర్మం గరుకుబారి నిర్జీవంగా కనిపిస్తుంది. అధికంగా జుట్టు రాలడంతోపాటు చుండ్రు సమస్య కూడా పెరుగుతుంది. ఇక ఈ కాలంలో కాళ్లు పగలడం సర్వసాధారణం. అందుకు ప్రధాన కారణం కాలుష్యం. శీతాకాలంలో దుమ్ము, పొగ ప్రభావంతో పాటు కాలుష్యం కూడా పెరుగుతుంది. దీని వల్ల కాళ్లకు చాలా త్వరగా..

Home Remedies: పగిలిన పాదాలకు ఇంట్లోనే చికిత్స.. ఈ టిప్స్‌ పాటించారంటే కోమలమైన పాదాలు మీ సొంతం
Home Remedies
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 08, 2023 | 8:50 PM

శీతాకాలంలో చలిగాలులు వీస్తాయి. దీనికి తోడు చలికాలంలో అనేక చర్మ సమస్యలు కూడా తలెత్తుతాయి. వాతావరణం పొడిగా ఉండటం వల్ల ఈ సమయంలో చర్మం పొడిబారుతుంది. ఫలితంగా చర్మం గరుకుబారి నిర్జీవంగా కనిపిస్తుంది. అధికంగా జుట్టు రాలడంతోపాటు చుండ్రు సమస్య కూడా పెరుగుతుంది. ఇక ఈ కాలంలో కాళ్లు పగలడం సర్వసాధారణం. అందుకు ప్రధాన కారణం కాలుష్యం. శీతాకాలంలో దుమ్ము, పొగ ప్రభావంతో పాటు కాలుష్యం కూడా పెరుగుతుంది. దీని వల్ల కాళ్లకు చాలా త్వరగా పగుళ్లు ఏర్పడుతాయి. ఈ సమయంలో కవర్ షూ ధరించడం ఉత్తమం. చలికాలంలో మనం ముఖాన్ని సంరక్షించే విధానం, క్రీములు పాదాలకు వర్తించవు. కాబట్టి చలికాలంలో బయటి నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత పాదాలను బాగా కడుక్కుని ఏదైనా క్రీమ్ రాసుకుంటే మంచిది. ఈ కాలంలో పాదాలు పగిలితే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. పగిలిన పాదాలకు ఇంట్లో సులువుగా ఇలా ట్రీట్‌మెంట్‌ చేసుకోండి. అదేలాగంటే..

2 చెంచాల బేకింగ్ సోడాలో ఒక చెంచా షాంపూ, అర చెంచా నిమ్మరసం మిక్స్ చేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంతో మీ పాదాలను శుభ్రం చేసుకోవాలి. పాత టూత్ బ్రష్‌తో ఈ పాదాలపై రుద్దండి. నల్లటి మురికి సులభంగా వదిలి పోతుంది. ఇలా వరుసగా మూడు రోజులు పాదాలను శుభ్రం చేసుకుంటే మురికి మొత్తం బయటకు వస్తుంది. శుభ్రం చేసిన తర్వాత క్రీమ్ అప్లై చేయండి.

కొవ్వొత్తి మైనం ప్యాక్‌ కూడా వేసుకోవచ్చు. ఒక పెద్ద గిన్నెలో వేడి నీళ్ళు పోసి అందులో చిన్న గిన్నె పెట్టి దానిలో మైనం వేయాలి. ఇది కరిగిన తర్వాత, 2 స్పూన్ల కొబ్బరి నూనెను జోడించండి. కొబ్బరి నూనెకు బదులుగా ఆలివ్ నూనెను కూడా ఉపయోగించవచ్చు. అలాగే ఒక చెంచా వాసెలిన్ వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక చెంచా ఆముదం, అలోవెరా జెల్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా తయారు చేసిన క్రీమ్‌ను పొడి పాదాలపై రాసుకుంటే.. పాదాలు మృదువుగా మారుతాయి. ఈ క్రీమ్‌ను గోరువెచ్చగా వేడి చేసి అపై అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.