Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coconut Water: వృద్ధులు రోజూ కొబ్బరి నీరు తాగుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త.. ఎన్ని సమస్యలకు వెల్కం చెబుతున్నారో తెలుసా..

ప్రకృతి మానవులకు ఇచ్చిన వరం కొబ్బరి నీరు. ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు చేస్తుంది. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. అయితే ఈ కొబ్బరి నీరుని వయసు పెరిగే కొద్దీ రోజూ తాగుతుంటే జాగ్రత్త సుమా అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వృద్ధులు కొబ్బరి నీరుని రోజూ ఎందుకు తాగకూడదో కూడా చెప్పారు. కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.. అందునా వేసవిలో కొబ్బరి నీరు తాగడం చాలా మంచిదని అందరూ భావిస్తారు.. అయితే వృద్ధులు రోజూ కొబ్బరి నీరు తాగడం హానికరం కావచ్చు.

Coconut Water: వృద్ధులు రోజూ కొబ్బరి నీరు తాగుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త.. ఎన్ని సమస్యలకు వెల్కం చెబుతున్నారో తెలుసా..
Coconut WaterImage Credit source: pexels
Follow us
Surya Kala

|

Updated on: Mar 11, 2025 | 3:48 PM

సహజ పానీయం కొబ్బరి నీరు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. శరీరం హైడ్రేట్ గా ఉంచుతుంది. అయితే కొబ్బరి నీరు మంచిదని వయసు పెరిగే కొద్దీ.. ముఖ్యంగా వృద్ధులు రోజూ తాగడం మంచిది కాదు. ఎందుకంటే కొబ్బరి నీరులో అధికంగా పొటాషియం ఉంటుంది. ఇది కొంతమందికి హానికరం కావచ్చు. కనుక కొంత మంది రోజూ కొబ్బరి నీళ్ళు తీసుకుంటుంటే.. మొదట ఈ విషయంపై వైద్యుడిని సంప్రదించాలి. అనంతరం డాక్టర్ సూచన మేరకు కొబ్బరి నీళ్ళు తాగడం ముఖ్యం.

వృద్ధులు కొబ్బరి నీళ్లు ఎందుకు తాగకూడదో వివరిస్తూ డాక్టర్ జమాల్ ఎ ఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియో షేర్ చేశారు. కొబ్బరి నీళ్లలో అధిక మొత్తంలో పొటాషియం ఉందని ఆ వీడియోలో చెప్పారు. అటువంటి పరిస్థితిలో కొబ్బరి నీరు ఎక్కువుగా తాగడం వల్ల గుండె పనితీరుపై ప్రభావం చూపుతుంది. కొబ్బరి నీళ్లు దినచర్యలో భాగంగా చేసుకోవద్దని ఆయన సూచించారు. అయితే ఎండ బారిన పడిన వారు ఎండలో ప్రయాణిస్తుంటే కొబ్బరి నీళ్ళు తాగవచ్చు.

ఇవి కూడా చదవండి

వృద్ధులు కొబ్బరి నీళ్లు ఎందుకు తాగకూడదంటే

ఈ పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో వీక్షించండి

అధిక మొత్తంలో పొటాషియం: కొబ్బరి నీళ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది, ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అయితే వృద్ధులలో ముఖ్యంగా మూత్రపిండ సంబంధిత సమస్యలు ఉంటే.. అదనపు పొటాషియం శరీరం నుంచి బయటకు రాదు. అప్పుడు హైపర్‌కలేమియాకు దారితీస్తుంది. అంతేకాదు క్రమరహిత హృదయ స్పందన రేటు, కండరాల బలహీనతకు కారణమవుతుంది.

రక్తపోటుపై ప్రభావం: ఎవరైనా వ్యక్తులు ముఖ్యంగా వృద్ధులు ఇప్పటికే తక్కువ రక్తపోటు (హైపోటెన్షన్) కోసం మందులు తీసుకుంటుంటే.. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల రక్తపోటు మరింత తగ్గుతుంది. దీనివల్ల తలతిరగడం, బలహీనత , మూర్ఛపోవడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

చక్కెర స్థాయి పెరగవచ్చు: కొబ్బరి నీరు సహజంగా తీపిగా ఉంటుంది. కార్బోహైడ్రేట్లను కూడా కలిగి ఉంటుంది. కనుక కొబ్బరి నీరు ఎక్కువ మొత్తంలో తాగడం వల్ల డయాబెటిక్ రోగులకు హానికరం ఎందుకంటే ఈ కొబ్బరి నీరు రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. వృద్ధులలో జీవక్రియ నెమ్మదిగా ఉంటుంది.. ఈ కారణంగా శరీరం దానిని త్వరగా ప్రాసెస్ చేయలేకపోతుంది.

కడుపు సమస్యలు రావచ్చు: కొంతమంది వృద్ధులకు కొబ్బరి నీళ్లు తాగిన తర్వాత గ్యాస్, కడుపు నొప్పి లేదా విరేచనాలు వంటి సమస్యలు రావచ్చు. కొబ్బరినీరు సహజ ఎలక్ట్రోలైట్లను కలిగి ఉంటుంది కనుక ఎక్కువ మొత్తంలో కొబ్బరి నీరుని తాగితే జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది.

గుండె, మూత్రపిండాల రోగులకు ప్రమాదం: ఇప్పటికే గుండె జబ్బులు లేదా మూత్రపిండాల సమస్యలు ఉన్న వృద్ధులు కొబ్బరి నీళ్లను పరిమిత పరిమాణంలో త్రాగాలి. అధిక పొటాషియం, సోడియం సమతుల్యతను దెబ్బతీస్తాయి. అప్పుడు మూత్రపిండాలపై అదనపు ఒత్తిడి ఏర్పడుతుంది.

కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటంటే.. మీకు కనుక కొబ్బరి నీళ్లు తాగడం ఇష్టమైతే ఈ విషయంలో వైద్యుడి సలహా తీసుకుని అనంతరం కొబ్బరి నీరుని తాగడం ముఖ్యం. అదే విధంగా ఏదైనా తీవ్రమైన అనారోగ్య సమస్య ఉన్నా కొబ్బరి నీళ్లు తాగే ముందు వైద్యుడిని సంప్రదించండి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి