Astro Tips: ఈ నెల 16న ఆశ్లేష నక్షత్రంలో అడుగు పెట్టనున్న చంద్రుడు.. ఈ 3 రాశులు పట్టిందల్లా బంగారమే..
మనిషి తన జీవితంలో మంచి చెడులను తెలుసుకోవానికి మాత్రమే కాదు భవిష్యత్తును తెలుసుకోవడానికి జ్యోతిష్య శాస్త్రాన్ని ఎక్కువ మంది ఆశ్రయిస్తారు. జరిగినది, జరుగుతున్నది, జరగబోయే దానిని తెలుసుకోవడానికి ఎక్కువ మంది జ్యోతిష్యాన్ని విశ్వసిస్తారు. జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాలు, రాశులకు ప్రముఖ స్థానం ఉందని పేర్కొంది. నవ గ్రహాలు ఒక నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి అడుగు పెడతాయి. అప్పుడు మనిషి జీవితంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. చంద్రుడు త్వరగా సంచరిస్తాడు. మార్చి 16 ఉదయం 12:51 గంటలకు చంద్రుడు ఆశ్లేష నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఈ రోజున మూడు రాశులకు వెరీ వెరీ స్పెషల్. వీరు పట్టిందల్లా బంగారమే..

గ్రహాలు సంచరిస్తూ ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ఒక నక్షత్రం నుంచి మరొక నక్షత్రంలోకి అడుగు పెడతాయి. ఈ సమయంలో కొన్ని రాశులకు శుభ ఫలితాలను .. మరికొన్ని రాశులకు కష్టాలను తీసుకొస్తాయి. ఈ గ్రహాల కదలిక ప్రతి ఒక్కరి జీవితంపై ప్రభావం చూపిస్తుంది. అయితే ఈ రోజు కొన్ని రాశులకు చాలా ప్రత్యేకమైంది. కొన్ని రాశుల వారు ఏమి పట్టుకున్నా బంగారమే అవుతుంది. అదృష్టం వీరి సొంతం అవుతుంది. సక్సెస్ ను అందుకుంటారు. ఈ రాశులకు చెందిన ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితిలతో పాటు వైవాహిక, ప్రేమ జీవితంలో కూడా అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. నవ గ్రహాల్లో అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహం శనీశ్వరుడు అయితే.. అత్యంత వేగంగా కదిలే గ్రహం చంద్రుడు. వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం చంద్రుడు రాశులను, నక్షత్రాలను అత్యంత వేగవంతమైన వేగంతో మార్చడానికి ప్రసిద్ధి చెందాడు. దృక్ పంచాంగం ప్రకారం మార్చి 16, ఉదయం 12:51 గంటలకు చంద్రుడు ఆశ్లేష నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. చంద్రుడు గ్రహాలకు రాకుమారుడు బుధ రాశిలో సంచరించనున్నాడు. ఈ రోజు అదృష్టాన్ని సొంతం చేసుకునే రాశులు ఏమిటో తెలుసుకుందాం.. అందులో మీ రాశి ఒకటైతే మీ జీవితంలో కొత్త సంతోషాలు సొంతం అవుతాయి.
మిథున రాశి: (మార్చి 16 )ఈ రాశికి చెందిన వారు శుభ ఫలితాలు అందుకుంటారు. మంచి రోజులు ప్రారంభం అవుతాయి. సంపద పెరిగే అవకాశాలు న్నాయి. కెరీర్‌కి సంబందించిన నిర్ణయం తీసుకోవాలనుకుంటే, ఈ సమయం చాలా మంచిది. జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. వ్యాపారస్తులు కూడా పెట్టుబడుల విషయంలో ముందుకు వెళ్ళవచ్చు. మంచి లాభాలను పొందే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలను సొంతం చేసుకుంటారు.
కర్కాటక రాశి: ఈ రాశి వారిపై చంద్రుడు అపార కరుణ ఉంటుంది. వీరిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మరుగుపడే అవకాశం ఉంది. కర్కాటక రాశికి చెందిన వ్యక్తులు విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు చేస్తే ఆ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. సంతోషం కలిగించే వార్తలు వింటారు. కెరీర్ లో పురోగతి ఉంటుంది. వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నాలు ఫలించే అవకాశాలున్నాయి. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు.
కన్య రాశి: ఈ రాశి వారు చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఎప్పటి నుంచో రాకుండా నిలిచిపోయిన డబ్బులు లభించే అవకాశం ఉంది. వ్యాపారస్తులు పెట్టుబడుల విషయంలో పురోగతి ఉండవచ్చు. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక యాత్రకు వెళ్ళే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలు పరిష్కరించబడతాయి. చంద్రుని అనుగ్రహం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. పాత స్నేహితులను కలిసి సంతోషంగా గడుపుతారు. అయితే వీరు ఏ పని చేయాలనుకున్నా చాలా ఓపికతో ఉండాలి. సంపద పెరుగుతుంది. దీంతో వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు