AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coconut Milk Benefits: కొలెస్ట్రాల్ తగ్గుతుంది, రక్తహీనత పోతుంది! కొబ్బరి పాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..

ఢిల్లీలోని ధర్మశిల నారాయణ సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్‌లోని సీనియర్ డైటీషియన్ పాయల్ శర్మ మాట్లాడుతూ.. కొబ్బరి నీళ్లలాగే కొబ్బరి పాలు కూడా ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమైనవని చెప్పారు. కొబ్బరి పాలను ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. పాలు అంటే అలెర్జీ ఉన్నవారికి ఈ కొబ్బరి పాలు బెస్ట్ ఎంపిక అని తెలిపారు ఈ రోజు కొబ్బరి పాల ప్రయోజనాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..

Coconut Milk Benefits: కొలెస్ట్రాల్ తగ్గుతుంది, రక్తహీనత పోతుంది! కొబ్బరి పాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..
Coconut Milk
Surya Kala
|

Updated on: Jun 29, 2024 | 1:19 PM

Share

భారతీయ సంస్కృతిలో కొబ్బరి కాయకు ముఖ్యమైన స్థానం ఉంది. హిందువులు పండగలు, పర్వదినాలు, శుభకార్యాలు వంటి ఆచారాలలో కొబ్బరి కాయను ఖచ్చితంగా ఉపయోగిస్తారు. దక్షిణ భారతదేశంలో కొబ్బరికాయను, కొబ్బరి నూనెను పూజ నుండి వంట వరకు ఉపయోగిస్తారు. అంతేకాదు శాకాహారులకు కొబ్బరి అత్యంత ఇష్తమైన ఆహారం. అయితే ప్రస్తుతం ఎక్కువ మంది కొబ్బరి పాలను ఇష్టపడుతున్నారు. ఈ రోజు ఈ కొబ్బరి పాలు ఆరోగ్యానికి ఎలాంటి మేలు చేస్తాయి అనేది నిపుణులు చెప్పిన విషయాలను గురించి తెలుసుకుందాం..

ఢిల్లీలోని ధర్మశిల నారాయణ సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్‌లోని సీనియర్ డైటీషియన్ పాయల్ శర్మ మాట్లాడుతూ.. కొబ్బరి నీళ్లలాగే కొబ్బరి పాలు కూడా ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమైనవని చెప్పారు. కొబ్బరి పాలను ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. పాలు అంటే అలెర్జీ ఉన్నవారికి ఈ కొబ్బరి పాలు బెస్ట్ ఎంపిక అని తెలిపారు ఈ రోజు కొబ్బరి పాల ప్రయోజనాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..

కొవ్వు పదార్థం తక్కువ

కొబ్బరి పాలను తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని డైటీషియన్ పాయల్ శర్మ అంటున్నారు. కొబ్బరి పాలు ఆవు, గేదె పాల కంటే చిక్కగా ఉంటాయి. ఈ కొబ్బరి పాలల్లో ఎక్కువ మొత్తంలో క్రీమ్ ఉంటుంది. కొబ్బరి పాలు తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. నిజానికి ఇందులో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. వీటిని తాగిన తర్వాత కడుపు ఎక్కువ సమయం నిండుగా ఉంటుంది. దీని వల్ల మీరు ఫిట్‌గా ఉంటారు. వేగంగా బరువు తగ్గుతారు.

ఇవి కూడా చదవండి

కొలెస్ట్రాల్

కొబ్బరి పాలలో ఉండే లారిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అదనంగా కొబ్బరి పాలు బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణను అందిస్తుంది. అంతేకాదు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ మొత్తాన్ని కూడా తగ్గిస్తాయి. కనుక కొబ్బరి పాలు గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

రక్తహీనత నుంచి ఉపశమనం

కొబ్బరి పాలలో ఐరన్ కూడా మంచి పరిమాణంలో ఉంటుందని.. ఇది రక్తహీనత వంటి వ్యాధులను నివారిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది హిమోగ్లోబిన్ స్థాయిని కూడా పెంచుతుంది. కొబ్బరి పాలు తాగడం వల్ల చర్మానికి తేమ అందుతుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. జుట్టులో చుండ్రు సమస్యను తొలగిస్తుంది. అంతేకాదు చర్మం పొడిబారడం సమస్య నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏమైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి)

ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..