వేసవి నుంచి ఉపశమనమే కాదు.. సీజనల్ వ్యాధులను తెచ్చే వర్షం.. ఈ లక్షణాలు కనిపిస్తే.. చికిత్స తీసుకోండి..
వర్షాకాలంలో వాతావరణంలో తేమ ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. దీని వల్ల బ్యాక్టీరియా, వైరస్‌లు వృద్ధి చెందుతాయి. ఈ వైరస్‌లు, బాక్టీరియాలు అనేక రకాలు వ్యాధులకు కారణమవుతాయి. ఈ సీజన్‌లో వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల వల్ల రకరకాల వ్యాధులు పెరుగుతాయి. ఈ సీజనల్ వ్యాధుల బారిన పిల్లల నుంచి వృద్ధుల వరకూ ప్రతి ఒక్కరూ పడతారు.
వేసవి కాలంలో ఎండ, ఉష్ణోగ్రత నుంచి ఉపశమనం కలిగిస్తూ రుతుపవనాలు దేశంలో అడుగు పెట్టాయి. వర్షాలు కురుస్తుండడంతో మండే ఎండల నుంచి ఉపశమనం పొందారు. అయితే వర్షం ఇచ్చే ఈ ఉపశమనతో పాటు అనేక వ్యాధులను కూడా తెస్తుంది. వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి కొన్ని వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతాయి. సకాలంలో సరైన చికిత్స తీసుకోకపోతే, అవి ప్రాణాంతకంగా మారుతాయి. ఈ సీజన్‌లో ఏయే వ్యాధులు ముప్పు పొంచి ఉన్నాయో వైద్యుల చెప్పిన విషయాలు తెలుసుకుందాం. వ్యాధుల లక్షణాలు ఏమిటి? వాటిని ఎలా నివారించవచ్చు అనే విషయం ఈ రోజు తెలుసుకుందాం..
వర్షాకాలంలో వాతావరణంలో తేమ ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. దీని వల్ల బ్యాక్టీరియా, వైరస్‌లు వృద్ధి చెందుతాయి. ఈ వైరస్‌లు, బాక్టీరియాలు అనేక రకాలు వ్యాధులకు కారణమవుతాయి. ఈ సీజన్‌లో వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల వల్ల రకరకాల వ్యాధులు పెరుగుతాయి. ఈ సీజనల్ వ్యాధుల బారిన పిల్లల నుంచి వృద్ధుల వరకూ ప్రతి ఒక్కరూ పడతారు.
ఏ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందంటే
వర్షాకాలంలో టైఫాయిడ్, డయేరియా, వైరల్ ఫీవర్, డెంగ్యూ, మలేరియా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని లేడీ హార్డింజ్ మెడికల్ కాలేజీలోని మెడిసిన్ విభాగం హెచ్‌ఓడీ ప్రొఫెసర్ డాక్టర్ ఎల్‌హెచ్ ఘోటేకర్ చెబుతున్నారు. ముఖ్యంగా తినే నిల్వ ఉన్న ఆహారం తిన్నా , నీరు తాగినా టైఫాయిడ్ వస్తుంది. వర్షాకాలంలో టైఫాయిడ్ బాధితుల సంఖ్య పెరుగుతుంది. ఎందుకంటే టైఫాయిడ్‌కు కారణమయ్యే బ్యాక్టీరియా చాలా చురుకుగా ఉంటుంది. ఎవరైనా కలుషితమైన ఆహారం తిన్నా లేదా నీరు త్రాగినా ఈ బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించి టైఫాయిడ్‌కు కారణమవుతుంది.
ఈ సీజన్ లో డయేరియా వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్ ఘోటేకర్ చెబుతున్నారు. కలుషితమైన నీరు, ఆహారం వల్ల కూడా ఈ వ్యాధి బారిన పడతారు. దీని వల్ల వాంతులు, విరేచనాల సమస్య వస్తుంది. కొన్ని బాక్టీరియాలు వైరల్ ఫీవర్‌కి కూడా కారణమవుతాయి. అటువంటి పరిస్థితిలో ఈ సీజన్‌లో ఫ్లూ వచ్చే ప్రమాదం ఉంది.
డెంగ్యూ, మలేరియా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది
ఈ సీజన్‌లో అతిపెద్ద ప్రమాదం డెంగ్యూ, మలేరియా. ఈ రెండు జబ్బులు దోమ కాటు వల్ల వస్తాయి. వర్షాకాలంలో ఈ దోమలు నిలువ ఉన్న నీటిలో సంతానోత్పత్తి చేస్తాయి. ఇవి కుడితే డెంగ్యూ, మలేరియా వస్తుంది. ఈ వ్యాధులకు సకాలంలో చికిత్స అందించక పోతే అవి ప్రాణాంతకంగా మారవచ్చు.
బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తులకు ప్రమాదం
రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు వర్షాకాలంలో వ్యాధుల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఢిల్లీలోని సీనియర్ వైద్యుడు డాక్టర్ అజయ్ కుమార్ చెబుతున్నారు. ఈ వ్యక్తులు సులభంగా వైరస్, బ్యాక్టీరియా బారిన పడతారు. అటువంటి పరిస్థితిలో ఈ వ్యక్తులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
సీజనల్ వ్యాధుల లక్షణాలు ఏమిటంటే
- తీవ్ర జ్వరం
- తలనొప్పి
- శ్వాసకోస ఇబ్బంది
- వాంతులు, విరేచనాలు
- కండరాల నొప్పి
వర్షం వల్ల వచ్చే వ్యాధుల నుంచి ఎలా రక్షించుకోవాలంటే
- దోమలు వృద్ధి చెందకుండా ఉండేందుకు ఇంటి పరిసరాల్లో ఎక్కడా నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి.
- తినే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ కు దూరంగా ఉండండి.
- శుభ్రమైన, కాచిన వేడి నీరు త్రాగాలి
- పరిశుభ్రతపై శ్రద్ధ వహించండి, చేతులు శుభ్రంగా కడుక్కోండి
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..