Lord Shani: జూన్ 30 నుంచి శనీశ్వరుడు తిరోగమనం.. జీవితంలో కష్టాల నివారణకు ఏమి చేయాలంటే..
వృషభం, కర్కాటకం, తుల, కన్యా రాశుల వారు శని తిరోగమనం కారణంగా జాగ్రత్తగా ఉండాలి. న్యాయాధిపతి అయిన శనిదేవుడిని ఆరాధించడం వలన అన్ని కార్యాలలో విజయం లభిస్తుంది. అంతేకాదు జాతకంలో అతని స్థానం బలపడుతుంది. శనీశ్వరుడి ఆరాధనతో పాటు, చేసే పనుల విషయంపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే కర్మల ఆధారంగా వ్యక్తికి ఫలితాలను అందిస్తాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనీశ్వరుడు తిరోగమనం సమయంలో కొన్ని ప్రత్యేక విషయాలను గుర్తుంచుకోవాలి.
హిందూ మతంలో శనీశ్వరుడిని న్యాయ దేవుడు అని పిలుస్తారు. శని దేవుడు జీవులు చేసిన కర్మలను బట్టి అందుకు తగిన ఫలితాలను ఇస్తాడు. శనిశ్వరుడి ప్రతి కదలిక ప్రజలందరినీ ప్రభావితం చేస్తుంది. జూన్ 30, 2024న శనిగ్రహం కుంభరాశిలో తిరోగమనం చెందనున్నాడు. అంటే శనీశ్వరుడు రివర్స్‌లో కదలనున్నాడు. ఈ శని తిరోగమనం శుభప్రదంగా పరిగణించబడదు. ముఖ్యంగా కొంతమంది వ్యక్తులకు శనిశ్వర తిరోగమనం తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.
శనీశ్వరుడి తిరోగమనం ఎప్పుడంటే
జూన్ 30వ తేదీ అర్ధరాత్రి 12:35 గంటలకు శనీశ్వరుడు తనకు ఇష్టమైన కుంభరాశిలో తిరోగమనంలోకి వెళ్లనున్నాడు. అప్పటి నుంచి శనీశ్వరుడు 139 రోజుల పాటు తిరోగమనంలో ఉంటాడు. శని తిరోగమన చలనం 15 నవంబర్ 2024 వరకు ఉంటుంది. ఇలా శనిశ్వరుడి తిరోగమనం కదలిక కొంతమందికి ప్రాణాంతకంగా కూడా మారవచ్చు. అయితే ఇది కొంతమందికి కష్టాల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అటువంటి పరిస్థితిలో శనీశ్వరుడి రివర్స్ కదలిక వలన కలిగే దుష్ప్రభావాలను నివారించడానికి కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం అవసరం.
వృషభం, కర్కాటకం, తుల, కన్యా రాశుల వారు శని తిరోగమనం కారణంగా జాగ్రత్తగా ఉండాలి. న్యాయాధిపతి అయిన శనిదేవుడిని ఆరాధించడం వలన అన్ని కార్యాలలో విజయం లభిస్తుంది. అంతేకాదు జాతకంలో అతని స్థానం బలపడుతుంది. శనీశ్వరుడి ఆరాధనతో పాటు, చేసే పనుల విషయంపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే కర్మల ఆధారంగా వ్యక్తికి ఫలితాలను అందిస్తాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనీశ్వరుడు తిరోగమనం సమయంలో కొన్ని ప్రత్యేక విషయాలను గుర్తుంచుకోవాలి.
శని తిరోగమన సమయంలో కష్టాలు నివారణ కోసం
- శనీశ్వరుడి తిరోగమనం వలన దుష్ఫలితాలు కలగకుండా ఉండాలంటే రోజూ శని చాలీసా పారాయణం చేయాలి. శని తిరోగమనం రోజున ఖచ్చితంగా శనిదేవుడిని పూజించండి. దీనితో పాటు రావి చెట్టు వద్ద ఆవనూనె దీపం వెలిగించండి. ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు.
- శనీశ్వరుడిని శాంతింపజేయడానికి, ప్రతిరోజు శివలింగానికి జలాభిషేకం చేయండి. మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి. ఇది శనీశ్వరుడి అశుభ ప్రభావాలను ప్రభావితం చేయదని నమ్ముతారు.
- శని తిరోగమన సమయంలో నీడను దానం చేయండి. శనిదేవ్ ఇలా చేయడం వల్ల కూడా సంతోషంగా ఉంటాడు. ఒక గిన్నెలో కొంచెం ఆవాల నూనె తీసుకుని అందులో మీ ముఖాన్ని చూసి శని ఆలయంలో ఉంచండి.
- శని తిరోగమన సమయంలో ప్రతిరోజూ ఒక నల్ల కుక్కకు సేవ చేయండి. శనివారం నెయ్యి, రొట్టెలను కలిపి నల్ల కుక్కకు తినిపించండి. ఇలా చేయడం వల్ల శని ప్రసన్నుడై శని తిరోగమనం సమయంలో మీ జీవితంపై ఎలాంటి చెడు ప్రభావం చూపదు.
- శని తిరోగమనం వల్ల ప్రభావితమయ్యే రాశులవారు శని ప్రత్యక్షంగా మారే వరకు ప్రతిరోజూ దానధర్మాలు చేస్తూ ఉండాలి. అంతే కాకుండా నల్లని వస్త్రాలు, పాదరక్షలు, ఇనుము, నల్ల నువ్వులు, ఉసిరి వంటివి దానం చేయంచడం వలన విశేష ఫలితాలు పొందుతారు.
- శనీశ్వరుడి పూజ మంత్రం
- ఓం భాగభావాయ విద్మహే మృత్యు-రూపాయ ధీమహి తన్నో శని: ప్రచోదయాత్ ।ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం ఓం శం శనైశ్చరాయ నమః। అని జపించాలి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు