Shukra Gochar: కర్కాటక రాశిలోకి శుక్రుడు.. ఆ రాశుల వారి కుటుంబాల్లో కనీ వినీ ఎరుగని సుఖ సంతోషాలు..!

కుటుంబ బంధాలు, ఆప్యాయతలు, అనురాగాలు, అన్యోన్యతలకు సంబంధించిన కర్కాటక రాశిలోకి ప్రేమలు, పెళ్లిళ్లు, దాంపత్యం, శృంగారాలకు సంబంధించిన శుక్రుడు జూలై 7న ప్రవేశించి నెలాఖరు వరకు కొనసాగుతాడు. ఈ 24 రోజుల కాలంలో శుక్రుడు ఆరు రాశుల వారికి కుటుంబపరంగా కనీ వినీ ఎరుగని సుఖ సంతోషాలను కలిగిస్తాడు.

Shukra Gochar: కర్కాటక రాశిలోకి శుక్రుడు.. ఆ రాశుల వారి కుటుంబాల్లో కనీ వినీ ఎరుగని సుఖ సంతోషాలు..!
Shukra Gochar 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Jun 29, 2024 | 3:46 PM

కుటుంబ బంధాలు, ఆప్యాయతలు, అనురాగాలు, అన్యోన్యతలకు సంబంధించిన కర్కాటక రాశిలోకి ప్రేమలు, పెళ్లిళ్లు, దాంపత్యం, శృంగారాలకు సంబంధించిన శుక్రుడు జూలై 7న ప్రవేశించి నెలాఖరు వరకు కొనసాగుతాడు. ఈ 24 రోజుల కాలంలో శుక్రుడు మేషం, మిథునం, కర్కాటకం, కన్య, మకరం, మీన రాశుల వారికి కుటుంబపరంగా కనీ వినీ ఎరుగని సుఖ సంతోషాలను కలిగిస్తాడు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా, సాఫీగా సాగిపోతాయి. దాంపత్య జీవితంలో, వైవాహిక బంధంలో ఎటువంటి సమస్యలున్నా పరిష్కారమవుతాయి. అన్యోన్యతలు వృద్ధి చెందుతాయి. కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి.

  1. మేషం: ఈ రాశికి నాలుగవ స్థానంలో, అంటే సుఖ స్థానంలో, శుక్ర సంచారం వల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. దాంపత్య జీవితంలో అన్యోన్యత బాగా పెరుగుతుంది. శుభ కార్యాలు జరగడానికి అవకాశం ఉంది. గృహ, వాహన సౌకర్యాలు ఏర్పడతాయి. విహార యాత్రలు ఎక్కువవుతాయి. ప్రేమ వ్యవహారాలు, పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆరోగ్యం అనుకూ లంగా ఉంటుంది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందే అవకాశం ఉంది. మనశ్శాంతి ఏర్పడుతుంది.
  2. మిథునం: ఈ రాశివారికి ధన స్థానంలో శుక్ర గ్రహ ప్రవేశం వల్ల కుటుంబ పరిస్థితులు బాగా చక్కబడడంతో పాటు, ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. ఆర్థికంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం ఖాయమవుతుంది. మంచి కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడే అవకాశం ఉంది. ఇష్టమైన ప్రదేశాలకు విహార యాత్రకు వెళ్లడం జరుగుతుంది. ఇంట్లో శుభకార్యం జరుగుతుంది.
  3. కర్కాటకం: ఈ రాశిలో శుక్ర సంచారం వల్ల కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. ఎటు వంటి పొరపచ్చాలు, మాట పట్టింపులున్నా తొలగిపోతాయి. దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. గృహ, వాహన సౌకర్యాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగా మెరుగుపడు తుంది. తీర్థయాత్రలు, విహార యాత్రలు ఎక్కువగా చేయడం జరుగుతుంది. బంధుమిత్రులతో సఖ్యత, సామరస్యం పెరుగుతాయి. ఇంట్లో తప్పకుండా ఒకటి రెండు శుభకార్యాలు జరుగుతాయి.
  4. కన్య: ఈ రాశికి లాభ స్థానంలో శుక్ర సంచారం వల్ల ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ముఖ్య మైన ఆర్థిక అవసరాలు తీరిపోతాయి. ఆర్థిక సమస్యల నుంచి, ఒత్తిళ్ల నుంచి చాలావరకు బయట పడతారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. దాంపత్య జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో ప్రాభవం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు.
  5. మకరం: ఈ రాశికి సప్తమ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. కుటుంబ సమస్యలన్నీ చాలావరకు పరిష్కారం అవుతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. సమాజంలో ఒక ప్రముఖ వ్యక్తిగా చెలామణీ అవుతారు. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా వృద్ధి చెందుతాయి. అధికారులకు నమ్మకం బాగా పెరుగుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఒత్తిళ్లు తగ్గి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అనారోగ్యాలకు అవకాశం ఉండదు.
  6. మీనం: ఈ రాశికి పంచమ స్థానంలో శుక్రుడి ప్రవేశం వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా కలసి వస్తుంది. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. హనీమూన్లు ఎక్కువవు తాయి. పిల్లల నుంచి అనుకూలతలు పెరుగుతాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆదా యానికి, ఆరోగ్యానికి లోటుండదు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి సూచనలున్నాయి. కలలో కూడా ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!