Lord Shani Dev: వక్ర శనితో ఆ రాశుల వారు జాగ్రత్త.. ఆర్థిక నష్టాలకు అవకాశం..!
ఈ నెల 29వ తేదీ రాత్రి నుంచి కుంభ రాశిలో వక్రిస్తున్న శనీశ్వరుడు నవంబర్ 15 వరకూ, అంటే 135 రోజుల పాటు వక్రగతిలో కొనసాగుతాడు. శని వక్రించినప్పుడు తన వెనుక ఉన్న మకర రాశి ఫలితాలనివ్వడం జరుగుతుంది. దీనివల్ల కొన్ని రాశుల వారికి కొన్ని రకాల కష్టనష్టాలు తప్పక పోవచ్చు.ప్రతి పనీ పెండింగులో పడడం, ఏ ప్రయత్నమూ నెరవేరకపోవడం, తప్పటడుగులు వేయడం, తప్పుడు ఆలోచనలు చేయడం, ఆర్థికంగా నష్టపోవడం, అధికారుల ఆగ్రహానికి గురి కావడం వంటివి జరిగే అవకాశం ఉంది.
ఈ నెల 29వ తేదీ రాత్రి నుంచి కుంభ రాశిలో వక్రిస్తున్న శనీశ్వరుడు నవంబర్ 15 వరకూ, అంటే 135 రోజుల పాటు వక్రగతిలో కొనసాగుతాడు. శని వక్రించినప్పుడు తన వెనుక ఉన్న మకర రాశి ఫలితాలనివ్వడం జరుగుతుంది. దీనివల్ల కొన్ని రాశుల వారికి కొన్ని రకాల కష్టనష్టాలు తప్పక పోవచ్చు. మిథునం, కర్కాటకం, కన్య, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారికి ప్రతి పనీ పెండింగులో పడడం, ఏ ప్రయత్నమూ నెరవేరకపోవడం, తప్పటడుగులు వేయడం, తప్పుడు ఆలోచనలు చేయడం, ఆర్థికంగా నష్టపోవడం, అధికారుల ఆగ్రహానికి గురి కావడం వంటివి జరిగే అవకాశం ఉంది. ఈ రాశివారు వీలైనప్పుడల్లా శివాలయంలో అర్చన చేయించడం వల్ల, శని విగ్రహం ముందు దీపం వెలిగించడం వల్ల ఈ కష్టనష్టాల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది.
- మిథునం: ప్రస్తుతం భాగ్య స్థానంలో ఉన్న శనీశ్వరుడు వక్రించడం వల్ల అష్టమ శని ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాడు. దీనివల్ల ముఖ్యమైన పనులు, వ్యవహారాలన్నీ పెండింగులో పడే అవకాశం ఉంటుంది. ఏ ప్రయత్నమూ కలిసి రాక ఇబ్బంది పడడం జరుగుతుంది. ఆర్థికంగా చిక్కులు, సమ స్యలు తలెత్తుతాయి. స్నేహితులు శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది. శుభ కార్యాలు ఆగి పోతాయి. అనారోగ్య సమస్యలకు అవకాశం ఉంటుంది. తిప్పట, శ్రమ కాస్తంత ఎక్కువగా ఉంటాయి.
- కర్కాటకం: ఈ రాశికి ప్రస్తుతం అష్టమ శని ఫలితాలు ఇస్తున్న శని సప్తమ స్థానాన్ని ప్రభావితం చేస్తుండ డంతో, వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా, కుటుంబపరంగా కూడా కొన్ని కష్టనష్టాలను భరించాల్సి వస్తుంది. మీ పనితీరుతో ఎవరికీ సంతృప్తి చెందరు. కుటుంబంలో తీవ్రస్థాయి విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఆస్తి ఒప్పందాలు కుదర్చుకోకపోవడం మంచిది. గృహ, వాహనాల కొనుగోలు కూడా కొద్దిపాటి ఇబ్బందులకు దారితీస్తుంది. కొత్త నిర్ణయాలు తీసుకోకపోవడం చాలా మంచిది.
- కన్య: ప్రస్తుతం ఆరవ స్థానంలో సంచారం చేస్తున్న శని ఇక అయిదవ స్థాన ఫలితాలనివ్వడం జరుగు తుంది. దీనివల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకోని పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా బెడిసికొట్టడం జరుగుతుంది. పిల్లల వల్ల సమస్యలు తలెత్తుతాయి. ఆలో చనలు కలిసి రావు. ఒప్పందాల మీద సంతకాలు చేయడానికి సమయం అనుకూలంగా ఉండదు. కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. మిత్రుల వల్ల మోసపోతారు.
- తుల: శని వక్రించడం వల్ల ఈ రాశివారు అర్ధాష్టమ శని ఫలితాలను అనుభవించాల్సి వస్తుంది. గృహ, వాహన సంబంధమైన సమస్యలు తలెత్తుతాయి. అద్దె ఇంటిలో ఉన్నవారు ఇల్లు మారాల్సి వస్తుంది. ఇరుగుపొరుగుతో సమస్యలు తలెత్తుతాయి. తల్లి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు తగ్గుతాయి. అనవసర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఉద్యోగంలో పదోన్నతులు ఆగిపోతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలపరంగా స్తబ్ధత ఏర్పడుతుంది.
- ధనుస్సు: ఈ రాశివారికి ద్వితీయ స్థానం మీద వక్ర శని ప్రభావం పడుతున్నందువల్ల ఏలిన్నాటి శని ఫలి తాలు మళ్లీ అనుభవానికి వస్తాయి. ఆదాయంలో ఎదుగూ బొదుగూ ఉండదు. ఆర్థిక అవసరా లకు తగ్గ ఆదాయం లభించే అవకాశం ఉండదు. బంధుమిత్రులతో అపార్థాలు చోటు చేసుకుం టాయి. ఉద్యోగంలో ప్రాభవం తగ్గుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి ఆశించిన స్థాయిలో పెరగక పోవచ్చు. కుటుంబంలో చికాకులు తలెత్తవచ్చు. తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
- కుంభం: ఈ రాశిలో సంచారం చేస్తున్న శని వక్రించి మకర రాశిని ప్రభావితం చేస్తున్నందువల్ల కష్టార్జితంలో ఎక్కువ భాగం వృథా అయ్యే అవకాశం ఉంటుంది. కష్టం ఎక్కువ ఫలితం తక్కువ అన్నట్టుగా ఉంటుంది. ప్రయాణాల మీద డబ్బు అనవసరంగా ఖర్చయ్యే అవకాశం ఉంది. ప్రతి వ్యవహారం లోనూ వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. ప్రతి పనికీ ఒకటికి రెండుసార్లు తిరగాల్సి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో తప్పటడుగులు వేయడానికి, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశముంది.