Breathe easy foods: వర్షాకాలం వచ్చేసింది.. ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం మీ డైట్ లో వీటిని చేర్చుకోండి..
వేసవికి గుడ్ బై చెప్పేసి వర్షాకాలం వచ్చేసింది. వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో సీజనల్ వ్యాధులు కూడా విజృంభిస్తాయి. ముఖ్యంగా జలుబు, దగ్గుతో పాటు ఊపిరితిత్తుల ఆరోగ్యం కూడా ప్రమాదంలో పడుతుంది. ఊపిరితిత్తుల ఆనారోగ్యం అత్యంత ప్రమాదకరం. జలుబు, న్యుమోనియా, క్షయ, ఉబ్బసం, క్యాన్సర్, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు వంటి అనేక సమస్యలు కలుగుతుంటాయి. అయితే సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగే ఆహారం ముఖ్యంగా ఊపిరితిత్తులకు ఆరోగ్యానికి ఇచ్చే ఆహార పదార్ధాలున్నాయి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం..