లైఫ్ స్టైల్ మారింది.. తినే తిండి నుంచి నిద్రించే సమయం వరకు అన్ని మారిపోయాయి.. దీని కారణం వల్ల ప్రస్తుతం చాలా మంది ఊయకాయం సమస్యతో బాధపడుతున్నారు.. అయితే.. అన్ని ప్రమాదకర వ్యాధులకు మూల కారణం ఊబకాయం అని వైద్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా పొట్ట చుట్టూ నిల్వ ఉండే కొవ్వును సులభంగా కరిగించలేము. కానీ పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రోజూ కొన్ని తాజా కూరగాయలు.. ఆకు కూరలను తీసుకుంటే పొట్ట కొవ్వు సులభంగా కరిగిపోతుంది..