- Telugu News Photo Gallery Cinema photos Krishna Mukunda Murari Serial Fame Mukunda Alias Yashmi Gowda Throwback Photo
Yashmi Gowda: ఏం అమ్మాయి రా బాబు.. కత్తిలాంటి కళ్లతో భయపెట్టే అందమైన విలన్.. బుల్లితెరపై ఫేమస్..
తెలుగు రాష్ట్రాల్లోని బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు యాష్మీ గౌడ. తెలుగులో అనేక సీరియల్స్ ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకుంది. మొదట కన్నడ సీరియల్లో కనిపించిన యాష్మీ.. ఆ తర్వాత స్వాతి చినుకులు సీరియల్ ద్వారా తెలుగు తెరపైకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత కృష్ణ ముకుంద మురారి సీరియల్లో ముకుంద పాత్రలో
Updated on: Jun 29, 2024 | 11:48 AM

తెలుగు రాష్ట్రాల్లోని బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు యాష్మీ గౌడ. తెలుగులో అనేక సీరియల్స్ ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకుంది. మొదట కన్నడ సీరియల్లో కనిపించిన యాష్మీ.. ఆ తర్వాత స్వాతి చినుకులు సీరియల్ ద్వారా తెలుగు తెరపైకి ఎంట్రీ ఇచ్చింది.

ఆ తర్వాత కృష్ణ ముకుంద మురారి సీరియల్లో ముకుంద పాత్రలో నటిస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. ఇందులో కోల్పోయిన ప్రేమను తిరిగి పొందేందుకు నెగిటివ్ షెడ్స్ పాత్రలో అదరగొట్టేసింది. ఇందులో ముకుందగా యాష్మీ నటన వేరేలెవల్ అని చెప్పాలి.

కానీ ఇప్పుడు ఆ సీరియల్ నుంచి బయటకు వచ్చింది ముకుంద. కన్నడలో పలు సీరియల్స్ చేస్తూ.. అలాగే ఇటు తెలుగులో పలు రియాల్టీ షోలలో పాల్గోంటూ సందడి చేస్తుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న యాష్మీ నిత్యం క్రేజీ ఫోటోషూట్స్ షేర్ చేస్తుంది.

ఈ క్రమంలోనే తాజాగా యాష్మీ త్రోబ్యాక్ ఫోటో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. కెరీర్ ప్రారంభంలో ఎంతో అల్లరి పిల్లగా కనిపిస్తున్న యాష్మీ ఫోటో చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. అప్పటికీ ఇప్పటికీ యాష్మీ ఎంత మారిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

యష్మీ గౌడ లేటేస్ట్ లుక్ చూసి ఫిదా అవుతున్నారు నెటిజన్స్. చీరకట్టులో ఎంతో అందంగా కనిపిస్తూ కుర్రాళ్లను కట్టిపడేస్తుంది. సీరియల్లో మెయిన్ రోల్ అయినా.. విలన్ రోల్ అయిన తనదైన నటనతో మంత్రముగ్దులను చేస్తోంది యష్మీ.




