- Telugu News Photo Gallery Cinema photos Actress Mrunal Thakur Guest Role in Prabas's Kalki 2898 AD Movie
Mrunal Thakur: కల్కిలో అతిథి పాత్ర చేసిన బ్యూటీ.. మూవీ సెలక్షన్ లో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్న బ్యూటీ
తొలి సినిమాతోనే సౌత్ ఆడియన్స్‌కు హాట్ ఫేవరెట్‌గా మారిన బ్యూటీ మృణాల్ ఠాకూర్. టాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ... సౌత్, నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల్లోనూ దూసుకుపోతున్నారు. అందరు హీరోయిన్లలా కాకుండా మూవీ సెలక్షన్ విషయంలోనూ కొత్త ట్రెండ్ చూపిస్తున్నారు ఈ బ్యూటీ. ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల హాట్ ఫేవరెట్‌గా మారిపోయారు సిల్వర్ స్క్రీన్ సీత మృణాల్ ఠాకూర్.
Updated on: Jun 29, 2024 | 10:56 AM

తొలి సినిమాతోనే సౌత్ ఆడియన్స్‌కు హాట్ ఫేవరెట్‌గా మారిన బ్యూటీ మృణాల్ ఠాకూర్. టాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ... సౌత్, నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల్లోనూ దూసుకుపోతున్నారు. అందరు హీరోయిన్లలా కాకుండా మూవీ సెలక్షన్ విషయంలోనూ కొత్త ట్రెండ్ చూపిస్తున్నారు ఈ బ్యూటీ.

ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల హాట్ ఫేవరెట్‌గా మారిపోయారు సిల్వర్ స్క్రీన్ సీత మృణాల్ ఠాకూర్. సీతా రామం సినిమాతో తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ బ్యూటీ తెర మీద ఎంత ట్రెడిషనల్‌గా కనిపించారో.. రియల్ లైఫ్‌లో అంత ట్రెండీ అనిపించుకుంటున్నారు.

అంతేకాదు మూవీ సెలక్షన్ విషయంలో కొత్తగా ట్రై చేస్తున్నారు మృణాల్.నార్త్ మూవీస్‌తో పాటు ఆఫ్ స్క్రీన్‌లో అల్ట్రా గ్లామరస్‌గా కనిపించే ఈ భామ సౌత్ సినిమాల్లో మాత్రం హుందాగా కనిపించే రోల్స్ మాత్రమే చేస్తున్నారు.

అంతేకాదు క్యారెక్టర్‌కు ఇంపార్టెన్స్ ఉంటే గెస్ట్ రోల్ చేయడానికి కూడా రెడీ అంటున్నారు ఈ బ్యూటీ. తాజాగా కల్కి 2898 ఏడీలో అలాంటి క్యారెక్టరే ప్లే చేశారు.ఈ విషయంలో ఎప్పుడో క్లారిటీ ఇచ్చారు.

క్యారెక్టర్ సెలక్షన్ విషయంలో ప్రయోగాలు చేయటం తనకు ఇష్టమన్నారు మృణాల్. సీతారామమ్ సినిమాతో వచ్చిన ఇమేజ్‌ను అలాగే కంటిన్యూ చేయాలనుకోలేదని, అందుకే నార్త్‌లో గ్లామర్ రోల్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని చెప్పారు. అంతేకాదు అవకాశం వస్తే నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు కూడా చేయాలనుందన్నారు మృణాల్ ఠాకూర్.




