- Telugu News Photo Gallery Cinema photos Lovely movie actress shanvi srivastava latest stunning photos
లవ్లీ హీరోయిన్ లేటెస్ట్ ఫోటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే.. ఈ రేంజ్ లో ఉందేంటీ.!
కన్నడ ఇండస్ట్రీ నుంచి చాలా మంది హీరోయిన్ టాలీవుడ్ లో తమ సత్తా చాటుకుంటూ దూసుకుపోతున్నారు. కానీ ఓ అమ్మడు మాత్రం తెలుగులో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది ఆ బ్యూటీ ,మరెవరో కాదు శాన్వి.
Updated on: Jun 28, 2024 | 9:04 PM

కన్నడ ఇండస్ట్రీ నుంచి చాలా మంది హీరోయిన్ టాలీవుడ్ లో తమ సత్తా చాటుకుంటూ దూసుకుపోతున్నారు. కానీ ఓ అమ్మడు మాత్రం తెలుగులో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది ఆ బ్యూటీ ,మరెవరో కాదు శాన్వి.

ఆది సాయి కుమార్ హీరోగా నటించిన లవ్లీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది ఈ అమ్మడు. ఈ సినిమాలో తన నటనతో అందంతో ఆకట్టుకుంది.

ఆతర్వాత తెలుగులో ఒకటి రెండు సినిమాల్లో నటించింది. కానీ ఇక్కడ అంతగా సక్సెస్ కాలేకపోయింది శాన్వి. దాంతో కన్నడ ఇండస్ట్రీని నమ్ముకుంది. అక్కడ చాలా సినిమాల్లో కనిపించి మెప్పించింది. కన్నడలో మంచి క్రేజ్ తెచ్చుకుంది.

కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పిచింది శాన్వి.. కానీ ఇప్పుడు ఈ అమ్మడికి అవకాశాలు అంతగా రావడం లేదు. మొన్నామధ్య అవకాశాలు తగ్గాయని స్టేజ్ పై కన్నీళ్లు కూడా పెట్టుకుంది ఈ చిన్నది.

ఇక సోషల్ మీడియాలో శాన్వి చాలా యాక్టివ్ గా ఉంటుంది. క్రేజీ ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా శాన్వి గ్లామరస్ ఫోటోలను షేర్ చేసింది. అందాలు ఆరబోస్తూ ఫోజులిచ్చింది శాన్వి. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.




