- Telugu News Photo Gallery Cinema photos Indian movies are interesting choose amitabh bachchan for old age character
Amitabh Bachchan: ఇండియన్ సినిమాలో పెద్దాయన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా ‘బిగ్ బి’
అబ్బా ఏమున్నాడ్రా.. ఆ కారెక్టర్ కోసమే పుట్టినట్లున్నాడు కదా..! కొన్ని సినిమాలు చూస్తున్నపుడు.. కొందరి పాత్రలకు ఇలా కనెక్ట్ అవుతుంటాం కదా..! ఇప్పుడు అమితాబ్ బచ్చన్‌ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. రాజ గురువు, పెద్దాయన పాత్రలకు నిలువెత్తు నిదర్శనంగా మారుతున్నారు బిగ్ బి. ఆయన్ని మించిన ఆప్షన్‌ను దర్శకులు పట్టలేకపోతున్నారు. ఒకప్పుడు సినిమాల్లో పెద్ద తరహా పాత్రలు ఉంటే.. వాటికోసం ఎవరెవరో నటులను వెతికేవాళ్లు దర్శకులు.
Updated on: Jun 29, 2024 | 12:11 PM

అబ్బా ఏమున్నాడ్రా.. ఆ కారెక్టర్ కోసమే పుట్టినట్లున్నాడు కదా..! కొన్ని సినిమాలు చూస్తున్నపుడు.. కొందరి పాత్రలకు ఇలా కనెక్ట్ అవుతుంటాం కదా..! ఇప్పుడు అమితాబ్ బచ్చన్‌ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. రాజ గురువు, పెద్దాయన పాత్రలకు నిలువెత్తు నిదర్శనంగా మారుతున్నారు బిగ్ బి. ఆయన్ని మించిన ఆప్షన్‌ను దర్శకులు పట్టలేకపోతున్నారు.

ఒకప్పుడు సినిమాల్లో పెద్ద తరహా పాత్రలు ఉంటే.. వాటికోసం ఎవరెవరో నటులను వెతికేవాళ్లు దర్శకులు. కానీ ఇప్పుడా అవసరమే లేకుండా పోయింది. సినిమా ఏదైనా.. గురువు లాంటి ఓ పాత్ర ఉందంటే అమితాబ్ బచ్చన్ దగ్గరికి వెళ్తున్నారు మేకర్స్. తాజాగా కల్కిలో హీరో ప్రభాస్ అయినా.. కథను నడిపించింది మాత్రం అమితాబ్ పోషించిన అశ్వద్ధామ పాత్రే.

కల్కి సినిమాకు ప్రాణంగా నిలిచారు అమితాబ్ బచ్చన్. ఈ సినిమా మాత్రమే కాదు.. 2022లో విడుదలైన బ్రహ్మాస్త్రలోనూ రాజ గురువు పాత్రలో నటించారు బిగ్ బి. అందులోనూ బ్రహ్మాంశకు గురువుగా నటించారు అమితాబ్.

ఆ హూందాతనం ఉన్న నటుడు అమితాబ్ మాత్రమే తన పాత్రతో మరోసారి ప్రూవ్ చేసారు బిగ్ బి. 2019లో చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డిలోనూ గురువు పాత్ర కోసం ఏరికోరి మరీ అమితాబ్ బచ్చన్‌నే తెచ్చుకున్నారు చిరంజీవి.

ఈ పాత్ర ఆయన కాకపోతే ఇంకెవరూ చేయలేరని చాలా సార్లు చెప్పారు చిరంజీవి. ఆ సినిమాకు బిగ్ బి గురువు పాత్ర అంత కీలకమైంది. పెద్దాయన పాత్రలకు ఇండియన్ సినిమాలో అమితాబ్ ఒక్కడే పెద్దదిక్కుగా మారుతున్నారు.




