AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NASA: భూమికి పొంచి ఉన్నపెను ముప్పు.. దూసుకొస్తున్న గ్రహ శకలాలు..14ఏళ్లకు ఢీ కొట్టే అవకాశం

భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని గ్రహశకలాలను ఎదుర్కొనేందుకు సమాయత్తం అయ్యేందుకే ఈ ఎక్సెర్ సైజ్ చేపట్టినట్లు నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీనికి సంబంధించిన జూన్‌ 20న నాసా మేరీల్యాండ్‌లోని జాన్‌ హోప్కిన్స్‌ ఐప్లెడ్‌ ఫిజిక్స్‌ లాబరేటరీలో ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది నాసా. ఈ సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఇంకా 14ఏళ్ల సమయం ఉండడంతో దాన్ని దారి తప్పించేందుకు ప్రయత్నాలు చేయాల్సిన అవసరాన్ని తెలిపింది.

NASA: భూమికి పొంచి ఉన్నపెను ముప్పు.. దూసుకొస్తున్న గ్రహ శకలాలు..14ఏళ్లకు ఢీ కొట్టే అవకాశం
NasaImage Credit source: NASA
Surya Kala
|

Updated on: Jun 29, 2024 | 10:06 AM

Share

అంతరిక్షంలో గమ్యం లేకుండా తిరిగే గ్రహశకలం వల్ల భూమి పెను ముప్పు పొంచిఉందా? అంటే అవుననే చెప్తున్నారు శాస్త్రవేత్తలు. గ్రహశకలం ఒకటి భూమి వైపు దూసుకొస్తోందని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. 2038 జులై 12న భూమిని తాకే అవకాశం ఉందన్నారు నాసా సైంటిస్టులు గ్రహశకలం ఉనికిని గుర్తించినట్లు చెప్పారు. దాని పరిమాణం ఎంతనేది ఇంకా తెలియరాలేదని, భూమిని ఢీ కొట్టే ముప్పు మాత్రం 72 శాతం ఉందంటున్నారు. ప్రస్తుతానికి ఈ ముప్పును తప్పించేందుకు నాసా దగ్గర ఎలాంటి మార్గం లేదని తెలిపారు. అంతరిక్షంలోని గ్రహశకలాల వల్ల మన భూమికి ఏర్పడే ముప్పును అంచనా వేయడం, ముప్పును తప్పించేందుకు శాస్త్రవేత్తలు డబుల్ ఆస్టరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ మిషన్ ను ఆవిష్కరించారు. ఈ మిషన్ ద్వారానే భూమికి రానున్న ముప్పును ముందుగా గుర్తించినట్లు నాసా శాస్త్రవేత్తలు ప్రకటించారు.

14ఏళ్ల సమయం ఉండడంతో దారి తప్పించేందుకు ప్రయత్నాలు

గత ఏడాది (2023) ఏప్రిల్ లో నాసా సైంటిస్టులు బైనియల్ ప్లానిటరీ డిఫెన్స్ ఇంటరాజెన్సీ టేబుల్ టాప్ ఎక్సెర్ సైజ్ నిర్వహించారు. ప్రస్తుతం భూమిఈ గ్రహశకలాల వల్ల ఎటువంటి ముప్పు లేదని.. అయితే భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని గ్రహశకలాలను ఎదుర్కొనేందుకు సమాయత్తం అయ్యేందుకే ఈ ఎక్సెర్ సైజ్ చేపట్టినట్లు నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీనికి సంబంధించిన జూన్‌ 20న నాసా మేరీల్యాండ్‌లోని జాన్‌ హోప్కిన్స్‌ ఐప్లెడ్‌ ఫిజిక్స్‌ లాబరేటరీలో ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది నాసా. ఈ సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఇంకా 14ఏళ్ల సమయం ఉండడంతో దాన్ని దారి తప్పించేందుకు ప్రయత్నాలు చేయాల్సిన అవసరాన్ని తెలిపింది. భూమివైపు దుసుకోచ్చే శకలాలను అధ్యయనం చేసేందుకు వెంటనే ప్రయోగానికి అనుకూలమైన వ్యోమనౌకను రెడీ చేయడానికి నాసా సంస్థతో పాటు అమెరికా ప్రభుత్వం కూడా ఓ అంచనాకు వచ్చింది. ఈ వ్యోమనౌక గ్రహశకలానికి సమీపం వెళ్ళేలా ఉండడంతో పాటు అవసరమైతే దానిపై దిగే విధంగా ఉండాలని శాస్త్రవేత్తలు నిర్ణయించాయి.

ఇవి కూడా చదవండి

కైనెటిక్ ఇంపాక్ట్ సాంకేతిక సిద్ధం చేసిన నాసా

ఇప్పటికే భూమీ వైపు వచ్చే గ్రహశకలాలను దారి మళ్లించేందుకు కైనెటిక్ ఇంపాక్ట్ అనే సాంకేతికను సిద్ధం చేసింది నాసా. ఇందులో భాగంగా ఓ వ్యోమనౌకను గ్రహశకలంతో ఢీకొట్టించి దాని దిశ మారేలా చేయనున్నారు. అయితే, ఈ టెక్నాలజీ తోపాటు అదనపు సాంకేతికతలను అభివృద్ధి చేసుకోవాల్సిన ఆవస్యకతను ఈ కార్యక్రమం తెలియజేశారు నాసా సైంటిస్టులు. వారి అంచనా ప్రకారం, ప్రస్తుతం యావత్ భూమికి నష్టం కలిగించేంతట గ్రహశకలాలేవీ లేనప్పటికీ.. చిన్న చిన్న వాటివల్ల ప్రాంతీయంగా నష్టం కలిగే అవకాశం లేకపోలేదంటున్నారు. దీని కోసమే నానా కైనెకిట్ ఇంపాక్ట్ సాంకేతికతను అభివృద్ధి చేయనుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి