అల్లం టీ.. జింక్, ఫాస్పరస్, విటమిన్ B3, 6, ప్రొటీన్ వంటి పదార్థాలతో నిండి ఉంటుంది. ఈ పానీయంలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అల్లం అజీర్ణానికి కూడా గొప్ప మేలు చేస్తుంది. భోజనం తర్వాత చిన్న అల్లం ముక్కను నమిలితే ఇట్టే జీర్ణం అవుతుంది.