AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రకృతిలో స్త్రీ పురుషుల మధ్య తేడా అదే.. లింగ సమానత్వం గురించి సుధామూర్తి ఏం చెప్పారంటే

తన ప్రేరణాత్మక సందేశంతో నేటి యువతకు ప్రేరణగా నిలుస్తున్నారు సుధాముర్తి. ఇప్పుడు లింగ సమానత్వం అంటే ఏమిటి? లింగ సమానత్వంపై తన అభిప్రాయాన్ని వివరించారు సుధామూర్తి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సుధామూర్తి తన దృక్కోణంలో లింగ సమానత్వం అంటే ఏమిటో వివరించారు. ఇందుకు సంబంధిన వీడియో తన అధికారిక X ఖాతా (@SmtSudhaMurty)లో షేర్ చేశారు.

ప్రకృతిలో స్త్రీ పురుషుల మధ్య తేడా అదే.. లింగ సమానత్వం గురించి సుధామూర్తి ఏం చెప్పారంటే
Sudha Muarthi
Surya Kala
|

Updated on: Jun 29, 2024 | 1:55 PM

Share

ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధినేత్రి, రాజ్యసభ ఎంపీ, రచయిత్రి, సామాజిక సేవకురాలు సుధామూర్తి గురించి ఎంత చెప్పినా తక్కువే.. కొన్ని కోట్లకు అధిపతి అయిన సుధామూర్తి సాధారణ పౌరురాలిగా సాదాసీదా జీవితం గడుపుతూ కోట్లాది మంది ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. సరళతకు ఉదాహరణ సుధామూర్తి. తన ప్రేరణాత్మక సందేశంతో నేటి యువతకు ప్రేరణగా నిలుస్తున్నారు సుధాముర్తి. ఇప్పుడు లింగ సమానత్వం అంటే ఏమిటి? లింగ సమానత్వంపై తన అభిప్రాయాన్ని వివరించారు సుధామూర్తి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సుధామూర్తి తన దృక్కోణంలో లింగ సమానత్వం అంటే ఏమిటో వివరించారు. ఇందుకు సంబంధిన వీడియో తన అధికారిక X ఖాతా (@SmtSudhaMurty)లో షేర్ చేశారు.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియో ఇక్కడ ఉంది:

తన దృష్టిలో స్త్రీ పురుషులు సమానమే.. అయితే లింగాలు వేర్వేరుగా ఉంటాయని సుధామూర్తి చెప్పారు. స్త్రీ, పురుషులు ఇద్దరూ సైకిల్‌కి రెండు చక్రాల లాంటి వారని.. చక్రం లేకుండా సైకిల్ ముందుకు సాగనట్లే.. పురుషులు లేకుండా మహిళలు ముందుకు సాగలేరు.. అదే విధంగా మహిళలు లేకుండా పురుషులు ముందుకు సాగలేరు. ఆ విధంగా స్త్రీ, పురుషులు సమానమే. అయితే వివిధ మార్గాల్లో. మహిళలు మంచి నిర్వాహకులు.. స్త్రీలు సమాజంలో సానుభూతి, ప్రేమను పొందుతారు. అయితే పురుషులలోని ఈ భావోద్వేగ అంశం స్త్రీలలా ఉండదు. అయితే పురుషులు మంచి IQ (ఇంటెలిజెన్స్ కోటీన్) కలిగి ఉంటారు. అయితే పురుషులలో ఎమోషనల్ కోట్.. అంటే భావుకత లోపించిందని సుధామూర్తి వెల్లడించారు. ఒకరోజు క్రితం షేర్ చేసిన ఈ వీడియోకు 5 వేలకు పైగా వ్యూస్ రావడంతో.. స్త్రీ, పురుషుడు అనే ఈ రెండు అంశాలు లేకుండా ప్రకృతి పూర్తి కాదన్నది అసలు కథ అని నెటిజన్లు వ్యాఖ్యానించారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..