AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: అక్కా.! మరీ ఇలా ఉన్నావేంటి.. ఆమె వింత కోరిక వింటే పెళ్లికాని ప్రసాదుల గుండె బేజారే

కొందరు యువతులు పెళ్లికి ముందు వివిధ రకాల వింత, విచిత్రమైన కండీషన్లు పెట్టడం చూస్తుంటాం. ఇక పెళ్లైన తర్వాత.. భర్త ఆ కండీషన్ పాటించకపోవడం.. తద్వారా గొడవలు జరుగుతుండటం లాంటివి చూస్తూనే ఉంటాం. సాధారణంగా ఏ యువతి అయినా కూడా.. తనకు కాబోయేవాడు..

Viral: అక్కా.! మరీ ఇలా ఉన్నావేంటి.. ఆమె వింత కోరిక వింటే పెళ్లికాని ప్రసాదుల గుండె బేజారే
Viral Photo
Ravi Kiran
|

Updated on: Jun 29, 2024 | 1:30 PM

Share

కొందరు యువతులు పెళ్లికి ముందు వివిధ రకాల వింత, విచిత్రమైన కండీషన్లు పెట్టడం చూస్తుంటాం. ఇక పెళ్లైన తర్వాత.. భర్త ఆ కండీషన్ పాటించకపోవడం.. తద్వారా గొడవలు జరుగుతుండటం లాంటివి చూస్తూనే ఉంటాం. సాధారణంగా ఏ యువతి అయినా కూడా.. తనకు కాబోయేవాడు సిగరెట్లు, మద్యం లాంటి అలవాట్లకు బానిసగా ఉండకూడదు అని అనుకుంటుంది. దాని ప్రకారమే.. ఆ అలవాట్లన్నీ మానుకోవాలని.. అప్పుడే పెళ్లి అంటూ నిబంధన పెడుతుంది. కానీ ఈ వధువు మాత్రం కొంచెం డిఫరెంట్.. తనకు కాబోయే భర్తకు వింత కండీషన్ ఒకటి పెట్టింది. పెళ్లి తర్వాత ఆమె భర్త తీర్చలేకపోయాడు. ఈ ఘటన ఆగ్రాలో చోటు చేసుకుంది. దీంతో చివరికి ఏం జరిగిందంటే..

వివరాల్లోకెళ్తే.. ఆగ్రాకు చెందిన ఓ యువతికి.. అక్కడే స్థానిక ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో వివాహం నిశ్చయమైంది. ఈ తరుణంలో సదరు యువతి.. తనకు కాబోయే భర్తకు ఓ వింత కండీషన్ పెట్టింది. వరుడు జిమ్ ట్రైనర్‌గా పని చేస్తుండటంతో.. వివాహం తర్వాత తన బరువు తగ్గించాలన్న నిబంధన విధించింది. దీనికి అతడు కూడా అంగీకరించాడు. ఈ క్రమంలోనే వీరిద్దరికీ పెళ్లి జరిగింది.

ఇంతవరకూ బాగానే ఉంది. పెళ్లి తర్వాతే అసలు సమస్య వచ్చిపడింది. భార్యకు ఇచ్చిన మాట నెరవేర్చలేకపోయాడు ఆమె భర్త. వివాహానికి ముందు 75 కిలోలు ఉండగా.. సదరు యువతి పెళ్లి తర్వాత కూడా వెయిట్ తగ్గలేకపోయింది. దీంతో సదరు యువతి భర్తపై కోపంతో ఊగిపోయింది. పెళ్లి తర్వాత బరువు తగ్గిస్తానన్నావ్.. కొంచెం కూడా తగ్గించలేకపోయావ్.. ఇక నీతో ఉండటం నా వల్ల కాదు అంటూ భర్తకు తెగేసి చెప్పేసింది. ఆ తర్వాత విడాకుల నోటీసులను పంపించింది.

ఈ నిర్ణయం అటు వరుడు.. ఇటు అతడి బంధువులకు మైండ్ బ్లాంక్ చేసేలా చేసింది. ఇరు కుటుంబాలు కలిసి ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేయగా.. అస్సలు వినిపించుకోలేదు. ఇక ప్రస్తుతం ఫ్యామిలీ కౌన్సిలర్లు సదరు యువతికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆమె మాత్రం తన నిర్ణయం మార్చుకోవట్లేదు. కాగా, ఈ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

ఇది చదవండి: అరె.. ఏంట్రా ఇది.! ఆన్‌లైన్‌లో చెప్పులు ఆర్డర్ చేస్తే.. ఆరేళ్ల తర్వాత జరిగిందిదే

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..