AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: అరె.. ఏంట్రా ఇది.! ఆన్‌లైన్‌లో చెప్పులు ఆర్డర్ చేస్తే.. ఆరేళ్ల తర్వాత జరిగిందిదే

సాధారణంగా ఆన్‌లైన్‌లో ఏదైనా ఆర్డర్ పెడితే.. గంటల్లో లేదా 2 రోజుల్లో.. మహా అయితే వారం రోజుల్లో ఇంటికి ఆర్డర్ పార్శిల్ వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు మేము చెప్పబోయేది వింటే.. కచ్చితంగా మీరు షాక్ అవుతారు. ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో సుమారు 6 ఏళ్ల క్రితం చెప్పులు ఆర్డర్ పెట్టాడు.

Viral: అరె.. ఏంట్రా ఇది.! ఆన్‌లైన్‌లో చెప్పులు ఆర్డర్ చేస్తే.. ఆరేళ్ల తర్వాత జరిగిందిదే
Viral Post
Ravi Kiran
|

Updated on: Jun 28, 2024 | 11:39 AM

Share

సాధారణంగా ఆన్‌లైన్‌లో ఏదైనా ఆర్డర్ పెడితే.. గంటల్లో లేదా 2 రోజుల్లో.. మహా అయితే వారం రోజుల్లో ఇంటికి ఆర్డర్ పార్శిల్ వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు మేము చెప్పబోయేది వింటే.. కచ్చితంగా మీరు షాక్ అవుతారు. ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో సుమారు 6 ఏళ్ల క్రితం చెప్పులు ఆర్డర్ పెట్టాడు.. కాలం మారింది.. సంవత్సరం కూడా మారిపోయింది.. అయితేనేం ఆ ఆర్డర్ మాత్రం ఇంటికి రాలేదు. ఇక సరిగ్గా ఆరేళ్ల తర్వాత స్వయంగా సదరు ఈ-కామర్స్ ఆన్‌లైన్ సంస్థ కస్టమర్ కేర్ ఫోన్ చేసి.. ఆర్డర్ గురించి కస్టమర్ దగ్గర నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఆర్డర్ వివరాలు ఇలా ఉన్నాయి..

ఎహాసాన్ అనే వ్యక్తి స్పార్క్స్ కంపెనీ స్లిప్పర్‌లను ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ పెట్టాడు. ఇది జరిగింది 6 సంవత్సరాల క్రితం.. అంటే 2018లో రూ. 485కి కొనుగోలు చేశాడు. ఆర్డర్ 2018, మే 16న కన్ఫర్మ్ అవ్వగా.. మే 19న ఆర్డర్ షిప్పింగ్ అయింది. లెక్క ప్రకారం.. పార్శిల్ డెలివరీ 2018, మే 20న అవ్వాలి. ఆ డేట్‌కి రాలేదు.. అలా.. అలా.. ఆరేళ్ళు గడిచింది. చివరికి రెండు రోజుల క్రితం కస్టమర్‌కు అనూహ్యంగా ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ సర్వీస్ నుంచి కాల్ వచ్చింది. సదరు ఆర్డర్‌కి సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఎదుర్కుంటున్నాడో.. కస్టమర్ కేర్‌ సర్వీస్ పర్సన్.. సదరు వ్యక్తిని అడిగి తెలుసుకున్నాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఆ ఆర్డర్ రాకపోతే అప్పుడే ఎహాసన్.. దాన్ని క్యాన్సిల్ చేయవచ్చు. కానీ ఆ ఆర్డర్‌కి క్యాన్సిల్ ఆప్షన్ లేకపోవడం గమనార్హం. ఇక ఇటీవల సంస్థ కస్టమర్ కేర్ నుంచి కాల్ రావడం అతడ్ని మరింతగా ఆశ్చర్యపరిచింది. కాగా, ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరూ ఓసారి చూసేయండి.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఉన్న ఊర్లోనే నెలకు రూ. లక్ష సంపాదన.. ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఇక తిరుగుండదు

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
కార్బన్ జెన్‌జె ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలివే
కార్బన్ జెన్‌జె ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలివే
ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆడిన మొగోడు ఎవడో తెలుసా?
ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆడిన మొగోడు ఎవడో తెలుసా?
సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం
సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం
నిజమైన దెయ్యం సినిమా.. ఓటీటీలో ఎక్కువమంది చూసిన హారర్ థ్రిల్లర్
నిజమైన దెయ్యం సినిమా.. ఓటీటీలో ఎక్కువమంది చూసిన హారర్ థ్రిల్లర్
యాపిల్‌ కొత్త మోడల్‌ ఫోన్ గురించి ఆసక్తికర విషయం తెలుసా
యాపిల్‌ కొత్త మోడల్‌ ఫోన్ గురించి ఆసక్తికర విషయం తెలుసా
ఏసీ బస్సుల్లో కూడా మహిళలకు ఫ్రీ జర్నీ.. ప్రభుత్వం నంచి ప్రకటన..
ఏసీ బస్సుల్లో కూడా మహిళలకు ఫ్రీ జర్నీ.. ప్రభుత్వం నంచి ప్రకటన..
యాపిల్‌ మ్యూజిక్‌ యాప్‌లో కొత్త ఫీచర్లు ఇవే
యాపిల్‌ మ్యూజిక్‌ యాప్‌లో కొత్త ఫీచర్లు ఇవే