చికెన్ VS మటన్ పాయ.. చలికాలంలో ఆరోగ్యానికి ఏది మంచిదంటే?
చలికాలం వచ్చిందంటే చాలు చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్ వంటకాలు తినడానికి ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తారు. ఇక కొంత మంది ఎక్కువగా నాన్ వెజ్ తినడానికి ఇష్టపడుతారు. అయితే నాన్ వెజ్‌లో పాయ అంటే ఇష్టపడని వారు ఎవరు ఉంటారు చెప్పండి. చలికాలంలో వెచ్చగా ఉండటానికి చాలా మంది చికెన్, మటన్ పాయా తీసుకుంటారు. అయితే మరి శీతాకాలంలో శరీర ఆరోగ్యం కోసం ఏది తినడం మంచిదో ఇప్పుడు చూద్దాం.
Updated on: Dec 04, 2025 | 3:07 PM

చలికాలంలో మటన్ లేదా చికన్ సూప్ తాగడం వలన ఇది శరీరానికి వెచ్చదాన్ని ఇస్తుంది. అంతే కాకుండా రోగనిరోధక శక్తి పెంచడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే చాలా మంది ఈ సీజన్‌లో ఎక్కువ పాయాకే ప్రిపరెన్స్ ఇస్తుంటారు. అయితే మీరు ఏ సూప్ తాగడం ఆరోగ్యానికి మంచిది అనేది, మీ జీర్ణక్రియ మీ శరీర రకం పై ఆధారపడి ఉంటుందంట. కాగా, మీరు ఏది తీసుకుంటే బెస్ట్, చలికాలంలో మీరు ఏ సూప్ తాగడం మీ ఆరోగ్యానికి మంచిది అనే విషయం తెలియకపోతే, తప్పకుండా ఈ న్యూస్ చదవాల్సిందే. కాగా, నిపుణుల ప్రకారం, ఏ సూప్ అత్యతంత ప్రయోజనకరమో ఇప్పుడు చూద్దాం.

మటన్ పాయాలో ప్రోటీన్, ఐరన్, జింక్, విటమిన్ బి12 వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతే కాకుండా ఇది మీ శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడానికి, అలాగే శరీరానికి అవసరమైన పోషకాలు అందించడానికి ఉపయోగపడుతుంది. అంతే కాకుండా చలికాలంలో మీ శరీరం వెచ్చగా ఉండాలి, అలాగే, శరీరానికి కావాల్సిన బలం అందాలంటే తప్పకుండా మటన్ పాయాను తాగాలంట. దీనిలో కాల్షియం, బాస్వరం ఎక్కువగా ఉంటుంది.

అంతే కాకుండా మటన్ పాయలో కొల్లాజెన్, అమైనో ఆమ్లాల రసాలు కూడా ఎక్కువగా ఉండటం వలన ఇవి ఎముకల బలానికి చాలా మంచిది. దీనిని కనీసం వారంలో ఒక్కసారైనే తీసుకోవాడం వలన ఇది శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గును నివారిస్తుంది. అంతే కాకుండా ఇందులో ఉండే కాల్షియం, ప్రోటీన్స్ అనేవి ఎముకలను దృఢంగా తయారు చేస్తాయి.

ఇక చికెన్ సూప్‌లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది కండరాల పెరుగుదలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో ప్రోటీన్‌తో పాటు నియాసిన్ విటమిన్ బి3, సెలీనియం, ఫాస్పరస్, విటమిన్స్, వంటివి ఎక్కువగా ఉంటాయి. అందువలన శీతాకాలంలో చికెన్ సూప్ తాగడం వలన ఇది రోగనిరోధక శక్తిని పెంచి, జలుబును దగ్గించి, కండారాలను బలపరుస్తుంది. జీర్ణక్రియ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

అయితే చికెన్, మటన్ ఈ రెండింటీలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా చికెన్‌లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటే, మటన్ పాయలో ఆరోగ్యానికి మేలు చేసే సూక్ష్మపోషకాలు ఉంటాయి. అందువలన ఎవరికైన బోన్ సమస్యలు, ఎదుగుదల ఆగిపోవడం వంటి సమస్యలు ఉన్నవారు మటన్ సూప్ తాగడం చాలా మంచిదంట. మటన్ సూప్ రోజూ తీసుకున్నప్పటికీ ఎలాంటి ప్రభావం చూపదు. కానీ చికెన్‌లో ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వలన దీనిని రోజూ తీసుకోవడం మంచిది కాదు.



