- Telugu News Photo Gallery Know About 6 Dangerous health diseases carried by cockroaches and Prevention Tips
బొద్దింకల వల్లే ఈ ఆరు భయంకరమైన వ్యాధులు వస్తాయట.. మీ ఇంట్లోనూ ఉన్నాయా? జాగ్రత్త!
బొద్దింకలు.. దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో వీటి సమస్య కచ్చితంగా ఉంటుంది. ఇవి కిచెన్‌లోకి దూరి తినే ఆహార పదార్థాలను పాడు చేయడమే కాకుండా.. మన ఆరోగ్యానికి కూడా హానికరంగా మారుతున్నాయి. ఈ బొద్దింకల వల్లే చాలా మంది పలు రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇంతకు వీటి వల్లే వచ్చే వ్యాధులు ఏంటో తెలుసుకుందాం పదండి.
Updated on: Dec 04, 2025 | 3:27 PM

బొద్దింకల వల్ల మనకు అనారోగ్యం ఎందుకు వస్తుందని చాలా మంది అనుకోవచ్చు. కానీ వస్తాయి. బొద్దింకలు మనం తినే ఆహారమే కాకుండా.. చనిపోయిన చిన్న చిన్న జీవుల కలేబరాలను, మొక్కలను, మలం, జిగురు, సబ్బు, కాగితం ఇలా అనేక వాటిని తింటాయి. అయితే ఇవి రాత్రి పూట మన కిచెన్‌లో తిరుగూ ఓపెన్ చేసి ఉన్న ఆహార పదార్థాలపై మలవిసర్జన చేస్తాయి. మనం వాటిని అలానే తినడం వల్ల మనకు భయంకరమైన వ్యాధులు వస్తాయి.

బొద్దింకల వల్ల వచ్చే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఆరు రకాల బ్యాక్టీరియా వల్ల సంభవించవచ్చు. అవి ఏంటంటే సాల్మొనెలోసిస్ ఈ బ్యాక్టీరియా మన శరీరంలోకి ప్రవేశిస్తే.. విరేచనాలు, కడుపు నొప్పి, జ్వరం వంటి లక్షణాలు మన శరీరంలో కనిపిస్తాయి. ఇది పిల్లలు, వృద్ధులు, తక్కువ రోగనిరోధక శక్తి ఉన్నవారికి అత్యంత ప్రమాదకరం.

ఇక రెండవది గ్యాస్ట్రోఎంటెరిటిస్ బ్యాక్టీరియా. ఇది మన శరీరంలోకి ప్రవేశిస్తే వాంతులు, విరేచనాలకు కారణమవుతుంది. అలాగే మూడోవది అలెర్జీలు, ఆస్తమా. బొద్దింక చర్మం, లాలాజలం, మలంలోని అలెర్జీ కారకాలు గాలిలోకి విడుదల కావచ్చు. ఇవి పిల్లలలో ఆస్తమా రావడానికి ఒక ప్రధాన కారణం.

అలాగే బొద్దింకలు తిరిగే ఆహారం తినడం వల్ల ఫుడ్‌పాయిజనింగ్, ఇతర వ్యాధులకు కారణం కావచ్చు.ఈ బొద్దింకలు దాంతో పాటు స్టెఫిలోకాకస్ ఇన్ఫెక్షన్లు. స్కిన్ ఇన్ఫెక్షన్స్, టైఫాయిడ్ ,కలరా వంటి వ్యాధులను కూడా వ్యాప్తి చేయగలవని నిపుణులు చెబుతున్నారు

బొద్దింకల నుండి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలనే విషయానికి వస్తే... ఇందుకోసం మీరు ముందుగా మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. వీలైతే మీ ఇంట్లో నుంచి బొద్దింకలను తరిమికొట్టండి. వారానికోసారి ఇంటిని శుభ్రం చేసుకోండి.అలాగే ఇంట్లో చెత్తను ఉంచుకోకండి. మీరు తినే ఫుడ్‌ను ఎప్పుడూ మూత పెట్టి ఉంచండి. ఇవి పాటించడం ద్వారా కొంతవరైన వాటి నుంచి ఉపసమనం పొందవచ్చు.




