చాణక్య నీతి: డబ్బును ఎలా ఖర్చు చేయాలి? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ఆచార్య చాణక్యుడు గొప్ప ఆర్థికవేత్త. భారత ఆర్థిక శాస్త్ర పితామహుడిగా చెబుతారు. మానవులు ఎదుర్కొంటున్న అనేక ఆర్థిక సమస్యలకు ఆయన సులభ పరిష్కారాలను చూపారు. చాణక్యనీతి అనే పుస్తకంలో ఆయన అనేక ఆర్థిక విషయాల గురించి వివరించారు. డబ్బును ఎలా ఉపయోగించాలి? ఎక్కడ ఖర్చు చేయాలి? అనే విషయాలను తెలియజేశారు.

ఆచార్య చాణక్యుడు గొప్ప ఆర్థికవేత్త. భారత ఆర్థిక శాస్త్ర పితామహుడిగా చెబుతారు. మానవులు ఎదుర్కొంటున్న అనేక ఆర్థిక సమస్యలకు ఆయన సులభ పరిష్కారాలను చూపారు. చాణక్యనీతి అనే పుస్తకంలో ఆయన అనేక ఆర్థిక విషయాల గురించి వివరించారు. డబ్బును ఎలా ఉపయోగించాలి? ఎక్కడ ఖర్చు చేయాలి? అనే విషయాలను తెలియజేశారు. డబ్బు వ్యక్తికి అత్యంత సన్నిహిత మిత్రుడని ఆయన పేర్కొన్నారు. మీ దగ్గర డబ్బు ఉంటే.. మీ జీవితంలో ఏదైనా సంక్షోభం వచ్చినా మీరు దాని నుంచి సులభంగా బయటపడవచ్చంటారు.
డబ్బు లేకపోవడమే అన్ని దు:ఖాలకు కారణమంటారు. అందుకే మీ చేతికి వచ్చిన డబ్బును జాగ్రత్తగా ఉపయోగించాలి. మీరు ఎంత డబ్బు సంపాదించినా.. దానిలో కొంత శాతాన్ని ఆదా చేయాలి. ఎందుకంటే.. ఆ డబ్బు మీ సంక్షోభ సమయంలో మీకు ఉపయోగపడుతుందని చాణక్యుడు చెబుతారు. చాణక్యుడు మీ వద్ద ఉన్న డబ్బును ఎప్పుడు, ఎలా ఖర్చు చేయాలనే అంశాలను స్పష్టంగా వివరించారు.
డబ్బును ఎప్పుడు? ఎలా ఖర్చు చేయాలి?
మనం డబ్బు ఎందుకు సంపాదిస్తాము అని చాణక్యుడు ప్రశ్నిస్తాడు. దానికి సమాధానంగా మనం ప్రపంచంలోని అన్ని మంచి వస్తువులను ఆస్వాదించగలగాలని, మనకు మంచి వసతి, ఆహారం ఉండాలని చెబుతారు. మనకు ప్రపంచంలోని అన్ని సౌకర్యాలు లభించాలి కాబట్టి ఒక వ్యక్తి సంపాదించే డబ్బులో 50 శాతం వరకు మీరు ఖర్చు చేయవచ్చు. మీరు సంపాదించిన డబ్బు పిల్లలకు మంచి నాణ్యమైన సౌకర్యాలను అందించడం మీ విధి అని చెబుతారు.
దాన ధర్మాలు ఎందుకు?
మనం ఈ లోకంలో పుట్టాం కాబట్టి.. ఇక్కడి సమాజానికి ఏదైనా ఇవ్వాలి. ఈ భావన ఎప్పుడూ మన మనస్సులో ఉండాలి. మనకు దానధర్మాలు చేసే అవకాశం వచ్చినప్పుడు.. వెనుకాడ కూడదని చాణక్యుడు చెబుతారు. మీరు మీ ఆదాయంలో పది శాతం దానధర్మాలకు ఖర్చు చేయవచ్చని స్పష్టం చేశారు.
పొదుపు ఎంత, ఎందుకు?
మీరు సంపాదించే డబ్బులో కనీసం 25 శాతం పొదుపు చేయాలని చాణక్యుడు చెబుతున్నారు. ఎందుకంటే. ఈ పొదుపు సంక్షోభ సమయంలో మీకు మద్దతుగా ఉంటుంది. మీకు తగినంత పొదుపు ఉంటే.. మీరు ఏ సంక్షోభం నుంచి అయినా సులభంగా బయటపడవచ్చు. ఈ డబ్బు మీకు కష్ట సమయాల్లో ఉపయోగపడుతుంది. కాబట్టి ఖర్చు చేసేటప్పుడు.. పొదుపుపై కూడా శ్రద్ధ వహించాలని చాణక్యుడు సూచించారు.
