కడప జిల్లాలోని ఒంటిమిట్ట మండలం కునరాజుపల్లిలో వింత సంఘటన జరిగింది. హరికృష్ణ అనే బాలుడి కలలో దేవుడు ప్రత్యక్షమై, గ్రామ శివారులోని గుట్ట వద్ద పుట్ట కింద ఉన్నానని చెప్పాడు. బాలుడు చెప్పిన చోట తవ్వకాలు జరపగా నరసింహ స్వామి, ఆంజనేయ స్వామి, లక్ష్మీదేవి పంచలోహ విగ్రహాలు బయటపడ్డాయి. మరిన్ని విగ్రహాలు భూమిలో ఉన్నాయని బాలుడు చెబుతున్నాడు.