మహబూబాబాద్ జిల్లా రాజోలులో వెంకన్న అనే గీత కార్మికుడు తాటి చెట్టు ఎక్కిన తర్వాత ప్రమాదవశాత్తు కాలుకున్న గుజి ఊడిపోయింది. మూడు గంటల పాటు తాటి కొమ్మను పట్టుకొని గాలిలో వేలాడుతూ మృత్యువుతో పోరాడాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకుని అతడిని సురక్షితంగా కిందకు దింపారు.