రీల్స్ కోసం పట్టాలపై పడుకున్న.. సాహస యువకుడికి ‘సన్మానం’వీడియో
రీల్స్ పిచ్చితో ఓ యువకుడు వేగంగా వెళ్తున్న రైలు కింద పడుకుని వీడియో తీసాడు. ఉత్తర ప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లా హసన్‌గంజ్ నివాసి అయిన అజయ్ రాజ్‌భర్ రైల్వే స్టేషన్ దగ్గర్లో ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఏదో ఒక వెరైటీ వీడియో చేయాలన్న తాపత్రయంతో ఎదురుగా రైలు రావడం చూసి పట్టాల మధ్యలో పడుకున్నాడు. వీడియో ఆన్ చేసి పెట్టి వేగంగా వెళ్తున్న రైలును వీడియో తీశాడు. రైలు వెళ్లిపోగానే పైకి లేచి ఏమీ తెలియనట్టు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ పై తీసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
అతడు భావించినట్లుగా కొద్ది క్షణాల్లోనే వీడియో వైరల్ అయింది. లక్షల్లో వ్యూస్ వచ్చాయి. అంతకు మించి కామెంట్లు, షేర్లు రావడంతో.. అజయ్ రాజ్‌భర్ తెగ సంబుర పడిపోయాడు. చిన్నపాటి సెలబ్రిటీని అయ్యానంటూ మురిసిపోయాడు. అయితే ఈ మురిపెం ఎక్కువ కాలం నిలవలేదు. ఎందుకంటే ఈ వీడియో రైల్వే పోలీసుల కంట పడింది. కథలో ట్విస్ట్ ఏంటంటే రైల్వే పోలీస్ తీవ్రంగా స్పందించడం. రైల్వే చట్టాల ఉల్లంఘనతో పాటు ప్రాణాపాయ స్టంట్లు చేస్తూ ఇతరులను తప్పుదోవ పట్టించేలా వ్యవహరించినందుకు నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీడియో ఆధారంగానే యువకుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. ఆ పై మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం అతడు ఊచలు లెక్కబెడుతున్నాడు. రైలు కింద పడుకున్న ఈ ఘటన రీల్స్ వెర్రి పరాకాష్టకు చేరిందని చెప్పడానికి నిదర్శనం . ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠినమైన జైలు శిక్షలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
పదేళ్లుగా ఆ రొట్టెలనే తింటున్నా రకుల్ డైట్ ఇదే వీడియో
క్యాబేజీ తిన్న యువతి మెదడులో పురుగులు వీడియో
కమ్మేస్తున్న పొగమంచు..గజగజా వణుకుతున్న జనం వీడియో
ఫ్రిజ్ ఖాళీ చేస్తున్న వ్యక్తి.. లోపలికి తొంగి చూసి షాక్ వీడియో
కొండగట్టు అంజన్నే నా ప్రాణాలు కాపాడారు వీడియో
ఉద్యోగులకు సర్కార్ గుడ్న్యూస్..భారీగా సెలవుల ప్రకటన వీడియో
రైతుల కోసం మరో కొత్త పథకం..డబ్బులు రిలీజ్.. జనవరి నుంచే అమలు
