AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇది కదా మానవత్వం అంటే..కోతికి పునర్జన్మ వీడియో

ఇది కదా మానవత్వం అంటే..కోతికి పునర్జన్మ వీడియో

Samatha J
|

Updated on: Jan 04, 2026 | 1:40 PM

Share

సిపిఆర్‌తో మనుషుల ప్రాణాలే కాదు మూగజీవుల ప్రాణాలు కూడా రక్షించవచ్చని వరంగల్‌లో నిరూపతమైంది. విద్యుతాఘాతానికి గురై స్తంభంపై నుండి నేల రాలిపడ్డ ఓ వానరం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడింది. అక్కడున్న ఆటో డ్రైవర్ తోపాటు స్థానికులు ఇది గమనించి వెంటనే సపర్యలు చేపట్టారు. కోతికి సిపిఆర్ చేసి పునర్జన్మను ప్రసాదించారు. దాదాపు 15 నిమిషాల పాటు స్పృహ తప్పి పడిపోయిన ఆ కోతి, సిపిఆర్ చేసిన తర్వాత లేచి చెంగుచెంగున ఎగురుతూ చెట్లపైకి మళ్లీ పరుగులు పెట్టింది. ఈ విచిత్ర సంఘటన చూసిన ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు.

ఈ వింత సంఘటన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ముందు జరిగింది. వానరసేనలు గుంపుగా సంచరిస్తున్నాయి. ఈ క్రమంలో ఓ వానరం విద్యుత్ షాక్ కు గురై స్తంభంపై నుండి కిందపడి గిలగిల కొట్టుకుంటోంది. ఇది చూసి అక్కడున్న వారు చలించి పోయారు. పదిహేను నిమిషాలకు పైగా కొట్టుమిట్టాడిన వానరం చివరకు స్పృహతప్పి పడిపోయింది. అక్కడి సీన్ చూస్తే.. ఆ వానరం చనిపోయిందనుకుని అంతా భావించారు. పక్కనే ఉన్న వానరాలు పెద్దఎత్తున అరుస్తున్నాయి..ఈ క్రమంలో ఆ వానరాన్ని గమనించిన అక్కడి మునిసిపల్ డోజర్ డ్రైవర్ హరీశ్ తోపాటు, మరో శానిటేషన్ జవాన్ మల్లికార్జున్ అప్రమత్తమై ఆ మూగజీవిని బ్రతికించేందుకు మానవ ప్రయత్నం చేశారు. సిపిఆర్ చేసి మూగజీవానికి ప్రాణం పోశారు. వానరానికి సిపిఆర్ చేయడం చూసి అంతా షాక్ అయ్యారు. ఆ వానరం బతకడం అసాధ్యమని వదిలేయండని కొందరు అన్ననప్పటికీ.. శానిటేషన్ జవాన్ తోపాటు మునిపల్ డ్రైవర్ వానరంపై జాలితో మానవ ప్రయత్నం చేశారు.