Ginger Benefits: 60 రోజుల పాటు అల్లం తింటే.. మీ శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే!
అల్లం.. ఇది రుచికి కారణంగా ఉన్నా.. దాన్ని తినడం వల్ల మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. KIMS హాస్పిటల్‌లోని చీఫ్ డైటీషియన్ డాక్టర్ అమ్రీన్ షేక్, రోజూ అల్లం తినడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. రోజూ అల్లం తినడం వల్ల శ్వాసకోశ సమస్యలు తగ్గడంతో పాటు జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే జలుబు, దగ్గు వంటి సమస్యలు కూడా తగ్గతాయి. అయితే 60 రోజుల పాటు అల్లం తినడం వల్ల మన శరీరంలో కలిగే మార్పులు ఏవో ఇక్కడ తెలుసుకుందాం.

భారతీయ వంటల్లో అల్లం అనేది ప్రత్యేక పదార్థం. ఇది వంటలకు రుచిని పెంచడమే కాకుండా.. మనకు ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ. యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి, ఇవి అనేక గొంతు, జీర్ణక్రియ, శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి. చాలా మంది దీన్ని వంటల్లోనే కాకుండా నేరుగా కూడా తింటారు. KIMS హాస్పిటల్‌లోని చీఫ్ డైటీషియన్ డాక్టర్ అమ్రీన్ షేక్ ప్రకారం.. 60 రోజుల పాటు రోజూ ఒక అల్లం ముక్కను తినడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించాడు.
60 రోజుల పాటు అల్లం తింటే కలిగే ప్రయోజనాలు
ఊపిరితిత్తులకు ప్రయోజనకరం : అల్లం అనేది ఊపరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తాయి. కానీ ఇది వెంటనే జరిగే ప్రక్రియ కాదు.. అది క్రమంగా పనిచేస్తుందని డాక్టర్ షేక్ వివరించారు. ఇది గొంతు నొప్పిని తగ్గిస్తుంది, జలుబు లేదా కాలుష్యం వల్ల కలిగే తేలికపాటి శ్వాస సమస్యలను తగ్గిస్తుంది. అలాగే శ్లేష్మం సన్నబడటానికి సహాయపడుతుంది, తద్వారా బయటకు వెళ్లడం సులభం అవుతుంది.
ఇది కూడా చదవండి: పొరపాటున కూడా వీటిని టీతో కలిపి తినకండి.. నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం తప్పదు!
రోజూ అల్లం నమలడం హానికరమా?
రోజూ కొద్దిగా అల్లం తినడం హానికరమని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది చాలా సురక్షితం, కానీ ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల నోటి చికాకు, ఆమ్లత్వం లేదా గ్యాస్ వస్తుంది. అల్లం కూడా రక్తాన్ని కొద్దిగా పలుచబరుస్తుంది. అందువల్ల, రక్తం పలుచబడే మందులు తీసుకునేవారు లేదా యాసిడ్ రిఫ్లక్స్ లేదా గ్యాస్ట్రిటిస్ ఉన్నవారు అల్లం తినే ముందు వైద్యుడిని సంప్రదించాలి.
ఇది కూడా చదవండి: ప్రపంచంలో అత్యంత ఖరీదైన బ్యాట్ ఇదేనట.. దీన్ని ఎవరు వాడారో తెలుసా?
మీరు రోజూ ఎంత అల్లం తినాలి?
డాక్టర్ షేక్ ప్రకారం, రోజులో ఒక చిన్న బొటనవేలు పరిమాణంలో ఉండే ముక్క లేదా 2-3 సన్నని ముక్కలు ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. అయితే, అల్లం నమలడం వల్ల గుండెల్లో మంట వస్తే, దాని పరిమాణాన్ని తగ్గించండి లేదా పచ్చిగా నమలడానికి బదులుగా దాన్ని దంచి గోరువెచ్చని నీటితో కలిగి ఆ నీటిని త్రాగండి ఇలా చేయడం వల్ల వాటి ప్రయోజనాలను పొందవచ్చు.
NOTE : పైన పేర్కొన్న అంశాలు నివేదికలు, ఇంటర్నెట్ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా అందించబడినవి మాత్రమే.. వీటిని టీవీ9 దృవీకరించట్లేదు. వీటిపై మీకేవైనా సందేహాలు ఉంటే.. వైద్యులను సంప్రదించండి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
