నోరు తెరిచి నిద్రిస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసుకోండి
సాధారణంగా కొంత మంది నోరు తెరిచి నిద్రిస్తుంటారు. లేదా వారు పడుకున్న తర్వాత వారికి తెలియకుండానే నోటితో శ్వాస తీసుకుంటూ ఉంటారు. అయితే, నోరు తిరిచి నిద్రపోవడం ఆరోగ్యానికి హానికరం అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నోరు తెరిచి నిద్రపోవడం వల్ల రాత్రిపూట శ్వాస సరిగా అందదని చెబుతున్నారు.

కొంతమంది నిద్రిస్తున్న సమయంలో వారి నోరు మాత్రం తెరిచే ఉంటుంది. వారికి తెలియకుండానే వారు నోరు తెరిచి వాటి ద్వారా గాలి పీల్చుకుంటారు. అయితే, నోరు తిరిచి నిద్రపోవడం ఆరోగ్యానికి హానికరం అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నోరు తెరిచి నిద్రపోవడం వల్ల రాత్రిపూట శ్వాస సరిగా అందదని చెబుతున్నారు. అంతేగాక, దీంతో స్లీప్ అప్నియా, గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.
నోటీ ద్వారా శ్వాస తీసుకోవడం వల్ల కలిగే సమస్యలు
నోటి ద్వారా శ్వాస తీసుకోవడం వల్ల టాన్సిల్స్ పరిమాణం పెరుగుతుంది. ఇది గురకకు దారితీస్తుంది. నిద్ర లేమికి దారితీస్తుంది. చిగుళ్లు, నోటి కణజాలాలు ఎండిపోవడం, నోటిలోని బ్యాక్టీరియా సమతుల్యతను దెబ్బతీసి, చిగుళ్ల వ్యాధికి, దంత ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉండటం వల్ల ఊపిరితిత్తుల పనితీరుపై ప్రభావం పడుతుంది. అస్తమా ఉన్నవారు నోటీ ద్వారా శ్వాస తీసుకుంటే మరింత ప్రమాదం బారినపడతారు. నోటితో శ్వాస తీసుకోవడం వల్ల కళ్ల చుట్టూ ఉన్న సిరలు వ్యాకోచించి కళ్ల చుట్టూ నల్లటి మచ్చలు ఏర్పడతాయి.
నోరు తెరిచి నిద్రపోవడం వల్ల నోటి లోపల లాలాజలం ఎండిపోతుంది. దీంతో చిగుళ్ల వ్యాధి, ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. ఈ అలవాటు పిల్లలలో దవడ పెరుగుదల, దుర్వాసనకు దారితీస్తుంది.
ప్రమాకర వ్యాధులకు అవకాశం
రాత్రిపూట మీ నోటి ద్వారా శ్వాస తీసుకోవడం వల్ల అబ్రస్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అనే పరిస్థితి ఏర్పడుతుంది. దీని కారణంగా నిద్రలో మీ వాయుమార్గం మూసుకుపోతుంది. ఇది గుండె జబ్బులు, టైప్2 డయాబెటిస్, కాలేయ సమస్యలు, నిరాశ, వంధ్యత్వ ప్రమాదాన్ని కూడా పెంచుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకే రాత్రిపూట నోరు తెరిచి పడుకునే అలవాటును పూర్తిగా తగ్గించుకోవాలని సూచిస్తున్నారు.
