Red Meat: ఎర్ర మాంసం తినడం నిజంగా ప్రమాదమా? డాకర్ట్ చెప్పిన షాకింగ్ నిజాలు!
మన దేశంలో మాంసాహారం తినేవారి సంఖ్య ఎక్కువే.. చాలా మంది మాంసాహారం తినేందుకు ఇష్టపడుతారు. ఎందుకంటే ఇవి రుచితోపాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అయితే ఎర్రమాంసం విషయానికి వచ్చే సరికి చాలా మంది దీన్ని ఆరోగ్యానికి హానికరంగా భావిస్తారు. దీని తినడం వల్ల గుండె సమస్యలు పెరుగుతాయిని అంటారు. మీకూ ఇలాంటి డౌటే ఉంటే.. గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శుభం వాత్స్య ప్రకరాం ఇది ఆరోగ్యమైనదా, అనారోగ్యమైనదా తెలుసుకోండి.

ప్రస్తుతం సోషల్ మీడియాలో రెడ్ మీట్ చుట్టూ ఒక చర్చ జరుగుతోంది. కొందరు దీనిని ఆరోగ్యానికి హానికరమని,ఇది గుండె జబ్బులను పెంచుతుందని భావిస్తే.. మరికొందరు ఇది మంచిదేనని అంటారు. కానీ రెడ్ మీట్ నిజంగా అంత హానికరమా, లేదా దాని చుట్టూ ఉన్న పుకార్లు కేవలం అపోహలేనా? అనేదాని గురించి ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, హెపటాలజిస్ట్ అయిన డాక్టర్ శుభం వాత్సయ తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ప్రస్తావించారు. డాక్టర్ వాత్సయ ప్రకారం, భారతదేశంలో అతిపెద్ద అపోహ ఏమిటంటే రెడ్ మీట్ తినడం వల్ల గుండెపోటు వస్తుంది. కానీ ఇక్కడ నిజం ఏమిటంటే రెడ్ మీట్‌ను సరైన మార్గంలో, సరైన పద్ధతిలో తీసుకుంటే, అది ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన అంటున్నారు.
ఎర్ర మాంసం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
రెడ్ మీట్ అనేది పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. ఇది మన శరీరానికి చాలా ముఖ్యమైన అధిక నాణ్యత గల ప్రోటీన్‌ను అందిస్తుందని ఆయన తెలిపారు. ఇందులో హీమ్ ఐరన్ (జంతువుల నుండి లభించే ఇనుము), జింక్ ,విటమిన్ బి12 కూడా పుష్కలంగా ఉన్నాయి, ఇవి రక్తహీనత, అలసటను తగ్గించడంలో, కండరాల నష్టాన్ని నివారించడంలో సహాయపడతాయి. మీకు సామాన్యంగా ఆకు కూరల్లో లభించే ఇనుముతో పోలిస్తే హీమ్ ఇనుము మన శరీరాల ద్వారా సులభంగా గ్రహించబడుతుంది. అందువల్ల, ఇనుము లోపాన్ని పరిష్కరించడంలో ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుందని డాక్టర్ వాత్స్యా అంటున్నారు.
ఎర్ర మాంసం ఎలా తినాలి?
ఎర్ర మాంసం తినడం మీరు ఆపాల్సిన అవసరం లేదు.. కానీ దాన్ని సరిగ్గా ఎలా తీసుకోవాలో నేర్చుకోండి. సాసేజ్, బేకన్, సలామి వంటి ప్రాసెస్ చేసిన ఎర్ర మాంసం తినడం వల్ల గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం పెరుగుతుందని డాక్టర్ వాత్స్యా హెచ్చరిస్తున్నారు. కాబట్టి ప్రాసెస్ చేయని, సన్నని ఎర్ర మాంసం తినాలని సూచిస్తున్నారు. వారానికి ఒకటి లేదా రెండుసార్లు అరచేతి పరిమాణంలో తినడం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన అన్నారు.
పోస్ట్ చూడండి.
View this post on Instagram
NOTE : పైన పేర్కొన్న అంశాలు నివేదికలు, ఇంటర్నెట్ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా అందించబడినవి మాత్రమే.. వీటిని టీవీ9 దృవీకరించట్లేదు. వీటిపై మీకేవైనా సందేహాలు ఉంటే.. వైద్యులను సంప్రదించండి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
