మటన్‌లోని ఈ పార్ట్ యమ స్పెషల్ గురూ.. తిన్నారంటే ఆ రోగాల మాటే ఉండదు..
మహిళల ఆరోగ్యానికి, ముఖ్యంగా రక్తహీనతతో బాధపడేవారు, గర్భిణులు, బాలింతల కోసం మటన్ తిల్లీ (స్ప్లీన్) వంటకం ఎంతగానో ఉపయోగపడుతుంది. సులభమైన శుభ్రపరిచే విధానం, ప్రత్యేక మసాలా మిశ్రమంతో కూడిన ఈ రెసిపీ రక్త స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. రుచిగా ఉండే ఈ టిల్లీ కర్రీని ప్రతి ఒక్కరూ సులభంగా తయారు చేసుకోవచ్చు.

మటన్ తిల్లీ లేదా స్ప్లీన్ లో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. ఐరన్, ప్రోటీన్ వంటి పోషకాలతో నిండిన అవయవ మాంసం పలు సమస్యలను నివారించడంలో బాగా సహాయపడుతుంది. ముఖ్యంగా ఆడపిల్లలకు, గర్భిణులకు, బాలింతలకు అత్యంత ప్రయోజనకరమైన ఆహారంగా పరిగణించబడుతుంది. రక్తహీనతతో బాధపడేవారికి ఇది రక్త స్థాయిలను పెంచడంలో తోడ్పడుతుందని డైటీషియన్లు చెబుతున్నారు. ఈ వంటకం తయారు చేయడానికి సరైన శుభ్రపరిచే విధానం కీలకమైనదని.. నాన్ వెజ్ తినే వారు దీనిని తింటే చాలా మంచిదని చెబుతున్నారు. దీనిని ఏ విధంగా వండుకున్నరా మంచిదేనని పేర్కొంటున్నారు.
మటన్ తిల్లిలో ఐరన్, ప్రోటీన్ తో పాటు.. విటమిన్ బి12, జింక్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తహీనత నివారణకు, హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి సహాయపడుతాయి.. అలాగే.. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.. ఇంకా కండరాల పెరుగుదల, మెదడు ఆరోగ్యానికి తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
తిల్లీని ఎక్కువగా మసాలా దినుసులతో కలిపి వేయించి తింటారు.. అలాగే.. కూరగా చేసుకుని తింటారు.. ఇది ఎలా తిన్నా మంచిదేనని పేర్కొంటున్నారు నిపుణులు..
మటన్ తిల్లీని ఎలా తయారు చేసుకోవాలి..
ముందుగా తిల్లీని బాగా శుభ్రం చేసుకోని వండుకోవాలి.. సాధారణంగా మటన్ మాదిరి వండుకోవాలి.. అయితే.. ముందుగా దాని పొరను తొలగించడం కోసం వేడినీటిలో వేసుకోవాలి.. ఆ తర్వాత దాని పొరను తొలగిస్తూ.. ముక్కలు చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
ఓ గిన్నెను తీసుకుని.. నూనె వేసి జీలకర్రతో పాటు ఉల్లిపాయలు, మెంతుకూర వేయించాలి. పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. చివరగా, గసగసాలు, జీలకర్ర, ధనియాలు, మిరియాలు, జాపత్రి, చెక్క, యాలక్కాయ, లవంగాలు, పచ్చి కొబ్బరితో చేసిన మసాలా పేస్ట్ కలుపుకోవాలి. నీళ్లు పోసి, తిల్లీ ముక్కలను వేసి ఉడికించాలి. చివరగా పచ్చిమిరపకాయలు, ఉల్లికాడలు, కొత్తిమీరతో గార్నిష్ చేసి వడ్డించాలి. సరైన పద్ధతిలో వండితే, తిల్లీ కర్రీ సాధారణంగా లివర్ కర్రీ లాగా నలుపు రంగులోకి మారకుండా, మంచి రంగులో ఉంటుంది.. దీనిని ఫ్రై లేదా కర్రీ మాదిరి జ్యూసీగా వండుకోవచ్చు..
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
