Weather Report: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సోమవారం వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ చూశారా..
తెలుగు రాష్ట్రాల్లో రాత్రిపూట చలి వణికిస్తోంది. ఇటీవల చాలా జాల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.. అయితే.. రెండు రోజుల నుంచి చలి తీవ్రత కొంత మేర తగ్గింది. జనవరి నెల ప్రారంభంలో సాధారణ శీతాకాలం ఉన్నా, సంక్రాంతికి మళ్లీ చలి పెరిగి, చివరి వారం నుంచి తగ్గుముఖం పడుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో రాత్రిపూట చలి వణికిస్తోంది. ఇటీవల చాలా జాల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.. అయితే.. రెండు రోజుల నుంచి చలి తీవ్రత కొంత మేర తగ్గింది. జనవరి నెల ప్రారంభంలో సాధారణ శీతాకాలం ఉన్నా, సంక్రాంతికి మళ్లీ చలి పెరిగి, చివరి వారం నుంచి తగ్గుముఖం పడుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.. ఈ క్రమంలో.. వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది.. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గినా.. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో గణనీయమైన మార్పు ఉండదని పేర్కొంది.
అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. దిగువ ట్రోపో ఆవరణములో కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలో ఈశాన్య, తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి..
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ వాతావరణము:-
ఆదివారం, సోమవారం, మంగళవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది.
పొగమంచు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశము ఉంది.
గమనిక :- రాగల 5 రోజుల్లో కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో గణనీయమైన మార్పు ఉండదు.
తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ, వాతావరణ హెచ్చరికలు:
తెలంగాణ రాష్ట్రంలో క్రింది స్థాయి గాలులు ప్రధానముగా తూర్పు, ఆగ్నేయ దిశల నుండి వీస్తున్నవి.. వీటి ప్రభావంతో రాగల 3 రోజులకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. ఆదివారం, సోమవారం, మంగళవారం రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రాబోయే రెండు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో పొగమంచు వచ్చే అవకాశం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
