Andhra News: కొడుకు కాదు.. కాలయముడు.. డబ్బుల కోసం తల్లిని ఏం చేశాడంటే?
గుంటూరు జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. డబ్బుల కోసం ఆశపడి పొన్నూరు మండలం కొండముది గ్రామానికి చెందిన నాగరాజు అనే ఒక కుమారుడు కన్నతల్లినే హతమర్చాడు. దాన్ని హత్యగా చిత్రీకరించే ప్రయత్నంచ చేశాడు.కానీ సీన్‌లోకి పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో అడ్డంగా బుక్కై జైల్లో ఊసలు లెక్కిస్తున్నాడు.

ఆరోజు ఆదివారం నాగరాజు ఎప్పటిలాగే సాయంత్రం ఇంటికి వచ్చాడు. ఇంట్లో ఉండాల్సిన తల్లి మొదట కనపించలేదు. అయితే ఇంట్లోకి వెళ్లి చూడగా తల్లి విగత జీవిగా పడిఉంది. ఆమె చనిపోయి ఉండటాన్ని చూసిన నాగరాజు తన తల్లిని ఎవరో చంపారంటూ స్థానికులకు చెప్పాడు. బంగారం కోసమే దొంగలు హత్య చేసి ఉంటారని తెలిపాడు. చుట్టుపక్కల వారంతా చూసి వెళ్లిన తర్వాత ఎవరో పోలీసులకు విషయం చెప్పారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు జయమ్మ మ్రుతదేహాన్ని పోస్టు మార్టమ్ కోసం ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు కూడా దొంగతనం చేయడానికి వచ్చిన వారే తన తల్లిని హత్య చేసి ఉంటారని నాగరాజు చెప్పాడు. అయితే అనుమానం వచ్చిన పోలీసులు ముందుగా అతన్నే అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించగా అసలు విషయాన్ని చెప్పేశాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్యానికి బానిసై జులాయిగా తిరుగుతున్న నాగరాజు గ్రామంలో రెండు లక్షల రూపాయల అప్పు చేశాడు. అప్పు తీర్చాలని ఒత్తిడి చేయడంతో తల్లి జయమ్మే ఆ బాకీలు చెల్లించింది. కొడకు తాగుడు కోసం విపరీతంగా అప్పులు చేస్తుండటంపై ఆమె మథన పడింది. ఇదే విషయమై తల్లికి కొడుక్కి మద్య గొడవ జరిగింది. ఏ పనిచేయకుండా అప్పులు చేయడమే కాకుండా తల్లితో కూడా నాగరాజు ఘర్షణ పడ్డాడు. ఈ క్రమంలోనే ఆమెపై మంచంకోడుతో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన తల్లి జయమ్మ అక్కడికక్కడే చనిపోయింది. తల్లి చనిపోయినట్లు నిర్ధారించుకున్న నాగరాజు ఆమె మ్రతదేహాన్ని ఇంట్లోకి తీసుకెళ్లి పడుకోబెట్టాడు. రక్తపు మరకల్ని చెరిపేసి అక్కడ నుండి జారుకున్నాడు.
ఇక సాయంత్రం ఏమీ తెలియనట్లు ఇంటికి వచ్చిన నాగరాజు తన తల్లిని బంగారం కోసం దొంగలు ఆమెను హత్యచేసినట్టు చుట్టుపక్కల వాళ్లకి చెప్పాడు. ఆనోటా ఈనోటా పాకి ఈ విషయం కాస్త పోలీసుల దృష్టికి చేరింది. అయితే అనుమానం వచ్చిన పోలీసులు మొదట అతన్నే అదుపులోకి తీసుకొని విచారించగా నిజం ఒప్పుకున్నాడు. దీంతో అతన్ని అరెస్ట్ చేశారు పోలీసులు. తల్లిని చంపడమే కాకుండా బంగారం కోసం దొంగలు చంపారంటూ కట్టుకథలు అల్లిన నాగరాజను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు. మూడు గంటల్లోనే హత్య కేసును చేధించిన పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
