Tirumala: పది గంటల పాటు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత.. ఈ సేవలన్నీ రద్దు!
గ్రహణ మాసానికి ఆరు గంటల ముందు ఆలయ తలుపులు మూసివేయడం ఆచారం. ఈ క్రమంలోనే మార్చి 03న ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 7:30 గంటల వరకు తిరుమల ఆలయ తలుపులు మూసివేయనున్నట్లు టీటీడీ పేర్కొంది. మార్చి 03న రాత్రి 8:30 గంటల తర్వాత శుద్ధి, ఇతర శుద్ధి కర్మల తర్వాత భక్తులను దర్శనానికి అనుమతిస్తామని అధికారులు తెలిపారు.

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కీలక ప్రకటన చేసింది. చంద్ర గ్రహణం కారణంగా మార్చి 3వ తేదీన తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ తలుపులు 10 గంటలకు పైగా మూసివేయనున్నట్లు తెలిపింది. మార్చి 03న చంద్రగ్రహణం సంభవిస్తుంది. దాదాపు మూడున్నర గంటలు ఉంటుంది. మధ్యాహ్నం 3:20 నుండి సాయంత్రం 6:47 వరకు గ్రహణం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆలయాన్ని మూసి వేస్తున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది.
గ్రహణ మాసానికి ఆరు గంటల ముందు ఆలయ తలుపులు మూసివేయడం ఆచారం. ఈ క్రమంలోనే మార్చి 03న ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 7:30 గంటల వరకు తిరుమల ఆలయ తలుపులు మూసివేయనున్నట్లు టీటీడీ పేర్కొంది. మార్చి 03న రాత్రి 8:30 గంటల తర్వాత శుద్ధి, ఇతర శుద్ధి కర్మల తర్వాత భక్తులను దర్శనానికి అనుమతిస్తామని అధికారులు తెలిపారు.
చంద్రగ్రహణం కారణంగా, ఆ భక్తులపై అష్టదళ పాదపద్మారాధన సేవ, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, అర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలకర సేవను తిరుమల తిరుమల దేవస్థానం రద్దు చేసింది. ఈ మేరకు టీటీడీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
మరిన్ని ఆద్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..