AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gangajal: మీ ఇంట్లో గంగా జలం ఉందా? ఇలా చేస్తే శుభప్రదం!

Gangajal: సనాతన ధర్మంలో గంగా జలానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. గంగా నదిలో స్నానం చేయడం అత్యంత పవిత్రమని భావిస్తారు. దీనివల్ల సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. అలాగే, గంగా జలాన్ని ఇంట్లో ఉంచితే ప్రతికూల శక్తులు దరిచేరవని నమ్మకం ఉంది. అయితే మత విశ్వాసాల ప్రకారం, ఇంట్లో గంగా జలాన్ని నిల్వ చేసేటప్పుడు కొన్ని నియమాలను పాటించకపోతే ప్రతికూల ప్రభావాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.

Gangajal: మీ ఇంట్లో గంగా జలం ఉందా? ఇలా చేస్తే శుభప్రదం!
Ganga Jal
Rajashekher G
|

Updated on: Jan 05, 2026 | 11:36 AM

Share

సనాతన ధర్మంలో గంగా జలానికి ప్రత్యేక ప్రధాన్యత ఉంది. గంగా నదిలో స్నానం చేయడం పవిత్రంగా భావిస్తారు. సకల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఇక, గంగా జలం ఉంచిన ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశించదని విశ్వసిస్తారు. మత విశ్వాసాల ప్రకారం.. ఇంట్లో గంగా జలాన్ని నిల్వ చేసేటప్పుడు కొన్ని నియమాలను పాటించకపోవడం వల్ల ప్రతికూల ప్రభావాలు ఎదుర్కోవాల్సి రావచ్చు. అందుకే ఇంట్లో గంగా జలాన్ని నిల్వ చేయడానికి పాటించాల్సిన నియమాలు, జాగ్రత్తలను తప్పక పాటించాలి.

ప్రజలు తరచుగా కాశీ, హరిద్వార్, రిషికేశ్ లేదా ఇతర పవిత్ర స్థలాల నుంచి ప్లాస్టిక్ బాటిళ్లలో గంగా జలాన్ని తీసుకుని వచ్చి ఇంట్లో నిల్వ చేసుకుంటారు. గ్రంథాల ప్రకారం గంగా జలాన్ని ఎప్పుడూ ప్లాస్టిక్ పాత్రలలో నిల్వ చేయకూడదు. ప్లాస్టిక్‌ను అపవిత్రంగా భావిస్తారు. గంగా జలాన్ని ఎప్పుడూ రాగి, ఇత్తడి, వెండి లేదా గాజుపాత్రలలో నిల్వ చేయడం ఉత్తమం.

సరైన దిశ, స్థానం గంగా జలాన్ని ఇంట్లో ఏ మూలలోనూ ఉంచకూడదు. వాస్తు ప్రకారం.. గంగా జలాన్ని ఈశాన్య దిశలో ఉంచడం శుభప్రదం. ఎందుకంటే ఇది దేవతల దిశగా పరిగణిస్తారు. గంగా జలాన్ని పూజా మందిరంలోనూ ఉంచవచ్చు.

చీకటి, ధూళికి దూరం

గంగా జలాన్ని చీకటి గదిలో లేదా అల్మారా మూలల్లో.. వెలుతురు పడని చోట ఎప్పుడూ ఉంచవద్దు. అలాగే దాని చుట్టూ ఉన్న శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వంట గది లేదా బాత్రూమ్ దగ్గర ఎప్పుడూ గంగా జలాన్ని ఉంచవద్దు. మురికిగా ఉన్న లేదా శుభ్రంగా లేని చేతులతో గంగా జలాన్ని ఎప్పుడూ ముట్టుకోకూడదని గుర్తుంచుకోవాలి. దానిని తాకే ముందు స్నానం చేయాలి. లేదా చేతులు, కాళ్లు కడుక్కోవాలి. గంగా జలం నిల్వ చేయబడిన ఇళ్లలో మాంసం తినరాదు, మద్యం సేవించరాదు. ఇది అశాంతిని పేదరికాన్ని కలగచేస్తుంది.

గంగా జలాన్ని ఇల్లంతా చల్లండి గంగా జలాన్ని ఇంట్లో నిల్వ చేస్తే సరిపోదు. శుభ సంకేతాల కోసం ఇంటి అంతటా కాలానుగుణంగా చల్లుకోవాలి. ముఖ్యంగా పూర్ణిమ లేదా పండగల సమయంలో గంగా జలాన్ని ఇల్లంతా చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంటిలోని ప్రతికూల శక్తి తొలగిపోయి, శాంతి వస్తుంది. ఇక శని ప్రభావం కలిగిన వ్యక్తులు.. ఒక పాత్రను శుభమైన నీటితో నింపి, కొన్ని చుక్కల గంగా జలాన్ని కలిపి, పుష్పించే చెట్టుకు సమర్పించాలి. ఇలా చేస్తే శని దోషం తొలగిపోతుంది.

Note: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలు, వాస్తుశాస్త్రంకు సంబంధించిన అంశాలపై ఆధారపడి ఉంది. దీనిని TV9తెలుగు ధృవీకరించదు.