Beauty Tips: ఖరీదైన మేకప్ కిట్స్ వద్దు.. ఉదయాన్నే ఈ 4 పనులు చేస్తే.. ముఖం అద్దంగా మెరవాల్సిందే!
అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ఇందుకోసం ఖరీదైన మేకప్ కిట్స్ తెచ్చుకొని రకరకాల ఉత్పత్తులను వాడుతూ ఉంటారు. దీని వల్ల వాళ్ల అందం పెరగకపోవడంతో పాటు.. కొన్ని సార్లు అది వాళ్ల చర్మాన్ని నాశనం కూడా చేస్తుంది. కాబట్టి మీ జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా మీరు సహజంగానే మీ ముఖాన్ని మెరిసేలా చేసుకోవచ్చు. ఇందుకు మనం చేయాల్సింది ఏంటో తెలుసుకుందాం.

అందంగా కనిపించేందుకు కొంత మంది రకరకాల బ్యూటీ ప్రాడక్ట్స్‌ను వాడుతారు. కానీ మనరోజు వారి అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా సహజంగానే మన చర్మాన్ని ప్రకాశవంతంగా, అందగంగా మర్చుకోవచ్చని చాలా మందికి తెలియదు. ఇందుకోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. రోజు ఉదయం నిద్రలేచిన వెంటనే ఈ నాలుగు అలవాట్లను అలవర్చుకుంటే సరిపోతుంది. ఇది మీ చర్మం సహజంగా మెరిసేందుకు ఎంతగానో దోహదపడుతుంది. కాబట్టి ఆ నాలుడు అలవాట్లు ఏవో తెలుసుకుందాం.
సహజంగా చర్మ సౌందర్యాన్ని పెంచే అలవాట్లు
చల్లటి నీటితో మొహం శుభ్రం చేసుకోవడం: మెరిసే, అందమైన చర్మం కోసం మీరు రోజూ ఉదయం నిద్రలేచిన వెంటనే మీ ముఖాన్ని చల్లటి నీటితో కడగాలి. ఇది మీ ముఖంపై ఉన్న మురికి, జిడ్డు వంటి పదార్థాలను తొలగిస్తుంది. మీరు ఉదయం మీ ముఖాన్ని శుభ్రం చేసుకోవడానికి తేలికపాటి ఫేస్ వాష్ లేదా క్లెన్సర్‌ను కూడా ఉపయోగించవచ్చు. కానీ ఉదయం రసాయనాలతో తయారు చేసిన ఫేస్ వాష్‌లను వాడేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి.. కావాలంటే సహజంగా లభించే వాటిని ఉపయోగించండి.
టోనింగ్ ప్రక్రియ: ముఖాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత టోనింగ్ ప్రక్రియ చాలా ముఖ్యం. ఇందుకోసం మీరు రోజ్ వాటర్ ఉపయోగించవచ్చు. మొహం కడుకున్న తర్వాత మీ ముఖంపై రోజ్‌వాటర్ అప్లై చేయండి. ఇది మీ చర్మాన్ని హైడ్రేటెడ్‌గా, తేమగా ఉంచుతుంది, మచ్చలను తగ్గిస్తుంది. అలాగే చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. మీకు టోనర్ లేకపోతే, మీరు స్కిమ్ టోనర్‌ను కూడా ఉపయోగించవచ్చు, ఆపై రోజ్ వాటర్‌ను అప్లై చేయవచ్చు.
సీరం ఆప్లై చేయడం: టోనర్ అప్లై చేసిన కొన్ని నిమిషాల తర్వాత మీ ముఖానికి సీరం అప్లై చేయండి. ఇందుకు మీరు విటమిన్ సి కలిగిన సీరం ఉపయోగించవచ్చు, ఇది చర్మానికి పోషణనిస్తుంది, చర్మాన్ని క్రమంగా ప్రకాశవంతంగా చేస్తుంది. మీ చర్మం పొడిబారడం తగ్గిస్తుంది.
మాయిశ్చరైజర్: సీరం అప్లై చేసిన ఒకటి నుండి రెండు నిమిషాల తర్వాత మీ చర్మానికి మాయిశ్చరైజర్ అప్లై చేయండి. ఇది మీ ముఖాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా చేస్తుంది.
పైన పేర్కొన్న నాలుగు దశలను మీరు రోజువారి దినచర్యలో భాగంగా చేసుకోవడం ద్వారా మీరు మీ అందాన్ని పెంచుకోవచ్చు. అలాగే మీరెప్పుడైనా ఇంటి నుంచి బయటకు వెళ్లేప్పుడు సన్‌స్క్రీన్ రాసుకోవడం మర్చిపోవద్దు. ఎందుకంటే సూర్యుని హానికరమైన కిరణాలు చర్మానికి హాని కలిగిస్తాయి. కాబట్టి, ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు మీ ముఖానికి సన్‌స్క్రీన్ రాయండి.
NOTE: పైన పేర్కొన్న అంశాలు నివేదికలు, ఇంటర్నెట్ నుంచి సేకరించిన అంశాల ఆధారంగా అందించబడినవి.. వీటిని టీవీ9 దృవీకరించట్లేదు. వీటిపై మీకేవైనా సందేమాలు ఉంటే వైద్యులను సంప్రదించండి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
